Wednesday, November 14, 2007

ఖైదీ బాబాయ్--1974




















సంగీత::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల.
తారాగణం::శోభన్ బాబు,వాణిశ్రీ,గీతాంజలి,ఝాన్సీరాణి,ఇందిరా,రామకృష్ణ,గుమ్మడి,ప్రభాకర్ రెడ్డి,ధూళిపాళ.

పల్లవి::

ఓ బాబూ..బయస్కోప్పిల్లొచ్చిందీ
బలే తమాషా..ఆ..చూపిస్తుందీ
పైసా గీసా లేకుండానే..పరమ రహశ్యం చూపిస్తుంది   
కాశీపట్నం కాదుర బాబూ..కాదుర బాబూ
ఇది కాళహస్తీ కానేకాదు..కాదుర బాబూ 

చరణం::1

పెళ్ళాడే బొమ్మకుమల్లే..ముస్తాబై వున్నాడూ
డూడూడూ బసవన్నంటే..నేనంటూ వురికాడూ
నే నే నంటూ..వురికాడూ
పెళ్ళాడే బొమ్మకుమల్లే..ముస్తాబై వున్నాడూ
డూడూడూ బసవన్నంటే నేనంటూ వురికాడూ 
నే నే నంటూ..వురికాడూ
సినిమాలో హీరోలాగా వచ్చాడూ..చెయ్యెసి చెప్పాడూ
ఫోజులెన్నో పెట్టాడూ..మోజువున్నదన్నాడూ
హోయ్..ఫోజులెన్నో పెట్టాడూ..మోజువున్నదన్నాడూ 
వియ్యానికి ముందుకువస్తే..అయ్యవెనక నాక్కాడు
కాశీపట్నం కాదుర బాబూ..కాదుర బాబూ 
యిది కల్ల బొల్లి గందరగోళం..పెళ్ళిర బాబూ 
బయస్కోప్పిల్లొచ్చిందీ..బలే తమాషా చూపిస్తుందీ
పైసా గీసా లేకుండానే..పరమ రహశ్యం చూపిస్తుంది   
కాశీపట్నం కాదుర బాబూ..కాదుర బాబూ
కాళహస్తీ కానేకాదు..కాదుర బాబూ 

చరణం::2

కట్నాలకు సంబధాలు..కాటాలో తూచారూ
ధర తూగని పేదపిల్లను..గిరివాటు వేశారూ
అయ్యో..మెడ బట్టి తోశారూ
కట్నాలకు సంబధాలు..కాటాలో తూచారూ
ధర తూగని పేదపిల్లను..గిరివాటు వేశారూ
అయ్యో..మెడ బట్టి తోశారూ
పదివేలకు అబ్బాయి బ్రతుకు అమ్మారు
బంధాలు..తెంచారు
పైసాలకు లొంగారు..పశువుల్లా మారారు
లేతలేత మనసుల మధ్య రాతి గోడలైనారు
కాశీపట్నం కాదుర బాబూ కాదుర బాబూ..ఛీ   
కట్నం కోసం గొంతులు కోసే..పెళ్ళిర బాబూ..అయ్యో 
కట్నం కోసం గొంతులు కోసే..పెళ్ళిర బాబూ..ఛీ ఛీ ఛీ 
కట్నం కోసం గొంతులు కోసే..పెళ్ళిర బాబూ..ఊఊఊఊ 

No comments: