సంగీత::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,వాణిశ్రీ,షావుకారు జానకి,పద్మనాభం,గుమ్మడి,రమాప్రభ,చంద్రమోహన్,సుమ,నిర్మల.
పల్లవి::
సూసినకొద్దీ నిన్నే సూడాలని వుంది
దాచినవన్నీ నీకే యివ్వాలని వుందీ
వగలమారిమామా..ఆ..పగటి సందమామా
సూసినకొద్దీ నిన్నే సూడాలని వుంది
దాచినవన్నీ నీకే యివ్వాలని వుందీ
వగలమారిమామా..ఆ..పగటి సందమామా
వగలమారిమామా..పగటి సందమామా
చరణం::1
నీ కండలు తిరిగిన ఒళ్ళుసూసీ
కలవరపడ్డది..నా మనసు
నీ కోరమీసం అంచులు..సూసీ
గుబగుబలాడెను..నా వయసు
నీ కండలు తిరిగిన ఒళ్ళుసూసీ
కలవరపడ్డది నా మనసు
నీ కోరమీసం అంచులు సూసీ
గుబగుబలాడెను..నా వయసు
పొద్దంతా ఊరంతా..నా వంకే సూస్తుంటే
పొద్దంతా ఊరంతా..నా వంకే సూస్తుంటే
రేతిరంత నీకోసం..మ్మ్..రెపరెపలాడెను నా సొగసు
వగలమారిమామా..ఆ..పగటి సందమామా
వగలమారిమామా..పగటి సందమామా
చరణం::2
పోట్ల గిత్తలాగా నువ్వూ పొలంగట్టున పోతుంటే
ఆ గట్టు మీది గరికనై నీ కాళ్ళనే ముద్దాడనా
పోట్ల గిత్తలాగా నువ్వూ పొలంగట్టున పోతుంటే
ఆ గట్టు మీది గరికనై నీ కాళ్ళనే ముద్దాడనా
మేడిపట్టి నువ్వూ..ఊ..బీడు దున్నుతుంటే
ఆ..మేడిపట్టి నువ్వూ బంజరు బీడు దున్నుతుంటే
ఆ మేడినై నీ చేతిలో నే వేడెక్కిపోనా
హా..వగలమారి మామా..ఆ..పగటి సందమామా
వగలమారి మావోయ్..పగటి సందమామా
చరణం::3
నీడలాగా నిన్నే..యెంటాడుతుంటాను
సుక్కల్లో దాక్కున్నా..పక్కనే వుంటాను
నీడలాగా నిన్నే..యెంటాడుతుంటాను
సుక్కల్లో దాక్కున్నా..పక్కనే వుంటాను
సందే సికటిలోన..సామిలోరి గుడికాడ
సంబరాలు సేసుకుందాం..సయ్యాటలాడుకుందాం
వగలమారి మామా..ఆ..పగటి సందమామా
సూసినకొద్దీ నిన్నే సూడాలని వుంది
దాచినవన్నీ నీకే యివ్వాలని వుందీ
వగలమారి మామా..ఆ..పగటి సందమామా
వగలమారిమామా..పగటి సందమామా
No comments:
Post a Comment