సంగీత::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::V.రామకృష్ణ,L.R.ఈశ్వరి
తారాగణం::శోభన్ బాబు,వాణిశ్రీ,షావుకారు జానకి,పద్మనాభం,గుమ్మడి,రమాప్రభ,చంద్రమోహన్,సుమ,నిర్మల.
పల్లవి::
ఒట్టంటే మాటలుకావు..చిలకమ్మా
అవి ఉత్తుత్తి ఆటలుకావు..తిలకమ్మా
జంక్షన్..తిలకమ్మా..ఆ ఆ ఆ ఆ
ఒట్టంటే మాటలుకావు.. చిలకమ్మా
ఒట్టంటే మాటలుకావు..నీటి మూటలుకావు
ఏటి ఊటలు కావు..పూల బాటలు కావు
అవే..సయ్యాటలు కావు
ఉత్తుత్తి ఆటలుకావు..తిలకమ్మా
జంక్షన్ తిలకమ్మా..తిలకమ్మా తిలకమ్మా
ఒట్టంటే మాటలుకావు..చిలకమ్మా
అవి ఉత్తుత్తి ఆటలుకావు..తిలకమ్మా
చరణం::1
కులుకుతో ఓరాజా..కులాసా యిస్తాను
తళుకుతో నారాజా..తమాషా చేస్తాను
నవ్వుతో ఒళ్ళంతా..జివ్వుమనిపిస్తాను
సై అంటే నా రాజా..సొర్గాలే అందిస్తాను
నాయాల్ది పొయ్యే
ఓనరైనగాని..మరి క్లీనరైనగాని
వాడు ఓనరైనగాని..మరి క్లీనరైనగాని
నువ్వు ఎక్కించే..ప్రతి మెట్టు
యెప్పుడో ఒకప్పుడు..బోల్తా కొట్టు
నాకు తెలుసులే..నీ గుట్టు
ఇక కట్టి పెట్టవే..నీ ఒట్టు
ఉత్తుత్తి ఆటలుకావు..తిలకమ్మా
జంక్షన్ తిలకమ్మా..తిలకమ్మా తిలకమ్మా
ఒట్టంటే మాటలుకావు..చిలకమ్మా
అవి ఉత్తుత్తి ఆటలుకావు..తిలకమ్మా
చరణం::2
నా జుత్తులోని మెలికలు..నీ తారురోడ్డు మలుపులు
నా మత్తెక్కిన చూపులు..మహ డేంజరు లైటులు
అహా..గేరు మార్చకుండానే..జోరును పుట్టించేవూ
స్టీరింగులు ముట్టకనే..టర్నింగులు పట్టేవూ
నువ్వు తిలకమ్మవైనా..మరి తిలకశ్రీవైనా..ఆఆఆ
ఒక్కరికే మనసివ్వటం..నీ ఒంటికే సరిపోదు
ఒట్టు నిలుపుకోవడం..నీ పుట్టుకలోనే
లేదూ..లేదూ..లేదూ..లేదూ
No comments:
Post a Comment