Tuesday, November 13, 2007

ఖైదీ బాబాయ్--1974

















సంగీత::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల.

పల్లవి::

ఎక్కడి వాడోగాని..చక్కని వాడే
ఎక్కడి వాడోగాని..చక్కని వాడే
ఎక్కడి వాడైతేమి..మక్కువ గలవాడే
ఎక్కడి వాడైతేమి..మక్కువ గలవాడే
నా మది దోచిన..చిన్నవాడే
ఓయమ్మ నా మది దోచిన చిన్నవాడే
ఎక్కడి వాడోగాని..చక్కని వాడే
ఎక్కడి వాడోగాని..చక్కని వాడే

చరణం::1

సూరీడు వుండగానే సుక్కలు..సూస్తాడే
వాడు యెండలోనే యెన్నెల పంటలు..పండిస్తాడే
సూరీడు వుండగానే సుక్కలు..సూస్తాడే
వాడు యెండలోనే యెన్నెల పంటలు..పండిస్తాడే
ముళ్ళలోనే జాజిమల్లెలూ..ఊఊఊఊఊ
ముళ్ళలోనే జాజిమల్లెలూ..పూయిస్తాడే
వాడు రాళ్ళలోనే తీయని రాగాలు..పలికిస్తాడే  
ఎక్కడి వాడోగాని..చక్కని వాడే
ఎక్కడి వాడోగాని..చక్కని వాడే

చరణం::2

తాను పల్లకిలో..వూరేగివస్తుంటే
నేను పెళ్ళి పడుచునై..ఎదురు చూస్తుంటే
తాను పల్లకిలో..వూరేగివస్తుంటే
నేను పెళ్ళి పడుచునై..ఎదురు చూస్తుంటే
నేను తొలిరాతిరి మొగ్గనై..ముడుచుకుంటే
తాను మొగ్గనే పూవులా..మలచుకుంటే 
అహాహా..ఓహోహో..మ్మ్ మ్మ్ మ్మ్   
ఎక్కడి వాడోగాని..చక్కని వాడే
ఎక్కడి వాడోగాని..చక్కని వాడే

చరణం::3

తలచుకుంటేనే ఒళ్ళు..నిలవకున్నాదే
వాడు తాకితే ఓయమ్మ..ఏమై పోతావో 
తలచుకుంటేనే ఒళ్ళు..నిలవకున్నాదే
వాడు తాకితే ఓయమ్మ..ఏమై పోతావో
పట్టులేక తీగెలాగ..ఆఆఆ  
పట్టులేక తీగెలాగ..చుట్టుకుంటాను 
తట్టుకోని వేడిలోన కాగిపోతానో..మరి కరిగిపోతానో 
ఎక్కడి వాడోగాని..చక్కని వాడే
ఎక్కడి వాడైతేమి..మక్కువ గలవాడే
నా మది దోచిన..చిన్నవాడే
ఓయమ్మ నా మది దోచిన చిన్నవాడే

No comments: