సంగీత::K.V.మహదేవన్
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::ఘంటసాల,P.B.శ్రీనివాస్,J.V.రాఘవులు
తారాగణం::అక్కినేని, కృష్ణకుమారి, గుమ్మడి, నాగయ్య, విజయలలిత
పల్లవి::
డబ్బులోనే వున్నదిరా..లోకమంతా
అది లేనివాడి బ్రతుకంతా..ఒకటే చింత
డబ్బులోనే వున్నదిరా లోకమంతా..ఈ లోకమంతా
అది లేనివాడి బ్రతుకంతా..ఒకటే చింత
చరణం::1
డబ్బుంటేనే దేవుడు దర్శనాలు..యిస్తాడు
దర్శనాలు...యిస్తాడు
పాడు దొంగ సొమ్మైనా..పాలుపంచుకుంటాడు
పాలుపంచుకుంటాడు
డబ్బుంటేనే దేవుడు దర్శనాలు..యిస్తాడు
దర్శనాలు...యిస్తాడు
పాడు దొంగ సొమ్మైనా..పాలుపంచుకుంటాడు
పాలుపంచుకుంటాడు
పైసాయిస్తే పాపం..పరిహారం చేస్తాడూ
పైసాయిస్తే పాపం..పరిహారం చేస్తాడూ
అందులో ఉందిరా మహత్తు..గమ్మత్తు
డబ్బులోనే వున్నదిరా లోకమంతా..ఈ లోకమంతా
అది లేనివాడి బ్రతుకంతా..ఒకటే చింత
చరణం::2
డబ్బొస్తే సుబ్బమ్మే సుబ్బలక్ష్మి..సుబ్బలక్ష్మి
అసే ఒసే అనే దెల్ల అమ్మగోరు..అమ్మగోరు
డబ్బొస్తే సుబ్బమ్మే సుబ్బలక్ష్మి..సుబ్బలక్ష్మి
అసే ఒసే అనే దెల్ల అమ్మగోరు..అమ్మగోరు
అరె ఒరె అనే వాడే అయ్యగారు..ఒహో అయ్యగారు
అరె ఒరె అనే వాడే అయ్యగారు..ఒహో అయ్యగారు
ఇంతేరా ఈ లోకం..ఎవ్వరూ మర్చలేరు
డబ్బులోనే వున్నదిరా
చరణం::3
ఉన్నవాణ్ణి పడగొట్టే..ఉద్దెశం మారాలి
లేనివాణ్ణి ఉద్దరింప..ప్రయత్నాలు చేయాలి
ఉన్నవాణ్ణి పడగొట్టే..ఉద్దెశం మారాలి
లేనివాణ్ణి ఉద్దరింప..ప్రయత్నాలు చేయాలి
మనసును మార్చుకుని..మంచినే పెంచుకుని
మనసును మార్చుకుని..మంచినే పెంచుకుని
అందరూ సుఖపడాలి..అభివృద్దికి రావాలి
డబ్బులోనే ఉన్నదిరా..ఆ హ హ..
మంచిలోనె ఉన్నదిరా..లోకమంతా
అది లేనినాడు మనకంత..ఒకటే చింతా
మంచిలోనె ఉన్నదిరా లోకమంతా..ఈ లోకమంతా
అది లేనినాడు మనకంత..ఒకటే చింతా
మంచిలోనె ఉన్నదిరా..లోకమంతా..ఆఆఆఆఆ
No comments:
Post a Comment