Saturday, November 21, 2009

బీదలపాట్లు--1972

సంగీత::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, కృష్ణకుమారి, గుమ్మడి, నాగయ్య, విజయలలిత

పల్లవి::

పాలనవ్వుల పాపాయీ..పసిడి పలుకుల పాపాయీ
నీ తల్లి ఆశలు నెరవేర్చగా..నేను జేవించి ఉన్నానమ్మా..ఆఆఆ   
పాలనవ్వుల పాపాయీ..పసిడి పలుకుల పాపాయీ

చరణం::1

నా యనువారే లేనివానికి..తీయనివరమై దొరికావమ్మా
నా యనువారే లేనివానికి..తీయనివరమై దొరికావమ్మా
కనుపాపగ నిను కాచుటకన్న..కోరిక లింకేవీ లేవమ్మా
కనుపాపగ నిను కాచుటకన్న..కోరిక లింకేవీ లేవమ్మా
నీవు దినమొక్క కళగా వెలగాలి..నా దీవెనలు నీతోడు నిలవాలి     
పాలనవ్వుల పాపాయీ..పసిడి పలుకుల పాపాయీ

చరణం::2

నా తల్లీ..నీ వెంతలోన..రతనాల బొమ్మగా ఎదిగావు
నా తల్లీ..నీ వెంతలోన..రతనాల బొమ్మగా ఎదిగావు
తనివితీర నినుచూడాలంటే..కనులు వేయైనా చాలవు 
తనివితీర నినుచూడాలంటే..కనులు వేయైనా చాలవు 
ఏ యింటి దీపమై నీవున్నా..ఆ యిల్లు కలకలలాడునమ్మా  
పాలనవ్వుల పాపాయీ..పసిడి పలుకుల పాపాయీ
నీ తల్లి ఆశలు నెరవేర్చగా..నేను జేవించి ఉన్నానమ్మా 
పాలనవ్వుల పాపాయీ..పసిడి పలుకుల పాపాయీ

No comments: