సంగీత::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, కృష్ణకుమారి, గుమ్మడి, నాగయ్య, విజయలలిత
పల్లవి::
నేనెవరో తెలిసిందీ..నిజమేదో తెలిసిందీ
నిరాశతో తపియించే బ్రతుకున..ఆశారేఖ మెరిసిందీ
నేనెవరో తెలిసిందీ..నిజమేదో తెలిసిందీ
నిరాశతో తపియించే బ్రతుకున..ఆశారేఖ మెరిసిందీ
చరణం::1
నిరుపేదగ నే పుట్టాను..నిట్టూర్పులలో పెరిగాను
నిరుపేదగ నే పుట్టాను..నిట్టూర్పులలో పెరిగాను
చీకటి వెలుగుల పెనుగులాటయే..జీవితమని కనుగొన్నాను
నేనెవరో..నే నెవరో తెలిసిందీ
చరణం::2
కసిపెంచుకున్న నాగుండెను..కనీళ్ళతోనే కడిగాను
కసిపెంచుకున్న నాగుండెను..కనీళ్ళతోనే కడిగాను
ద్వేషం త్రుంచీ ప్రేమను పెంచీ..మనిషిగ జీవిస్తాను
నేనెవరో..నే నెవరో తెలిసిందీ..ఈఈఈ
చరణం::3
కూటికి కరువై కుమిలేవారికి..తోడు నీడగా ఉంటాను
కూటికి కరువై కుమిలేవారికి..తోడు నీడగా ఉంటాను
మానవసేవే మాధవసేవగా..నా బ్రతుకే తీర్చుకుంటాను
నేనెవరో..నేనెవరో తెలిసిందీ
నిరాశతో తపియించే బ్రతుకున..ఆశారేఖ మెరిసిందీ
ఆశారేఖ మెరిసింది..ఆశారేఖ మెరిసింది ఆశారేఖ మెరిసింది
No comments:
Post a Comment