Wednesday, September 07, 2011

గాంధీపుట్టినదేశం--1973




సంగీతం::S.P.కోదండపాణి
రచన::శ్రీశ్రీ
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణంరాజు,పద్మనాభం,రాజబాబు,జానకి,జయంతి,రమాప్రభ,నిర్మల

పల్లవి::

హేయ్..ఓరోరీ గుంటనక్క ఊరేగే ఊరకుక్క  
మా జోలికి వచ్చావంటే గోరీ కట్టిస్తాం 
నీకు గోరీ కట్టిస్తాం..రేయ్ 
ఓరోరీ గుంటనక్క ఊరేగే ఊరకుక్క 
మా జోలికి వచ్చావంటే గోరీ కట్టిస్తాం 
నీకు గోరీ..కట్టిస్తాం                

చరణం::1

పేదవాళ్ళ మూగనోళ్ళు కొడతావా 
నువ్వు మేడ మీద మేడలెన్నో కడతావా 
ఒరేయ్ పేదవాళ్ళ మూగనోళ్ళు కొడతావా  
నువ్వు మేడ మీద మేడలెన్నో కడతావా 
కుటుంబాలు కూలదోసి నల్లడబ్బు పోగుచేసి  
కుటుంబాలు కూలదోసి నల్లడబ్బు పోగుచేసి  
కనుగానక మిడిసీ మిడిసీ పడతావా..రేయ్   
ఓరోరీ గుంటనక్క..ఊరేగే ఊరకుక్క 
మా జోలికి వచ్చావంటే గోరీ కట్టిస్తాం 
నీకు..గోరీ కట్టిస్తాం     

చరణం::2

చావలేక యిన్నినాళ్ళు బ్రతికున్నాము  
ఏమీ చేతకాని వాళ్ళలాగ పడిఉన్నాము
చావలేక యిన్నినాళ్ళు బ్రతికున్నాము  
ఏమీ చేతకాని వాళ్ళలాగ పడిఉన్నాము 
నీ పాపం పండగానే నీ నూకలు నిండగానే  
నీ పాపం పండగానే నీ నూకలు నిండగానే
అదునుచూసి మా తడాఖా చూపిస్తాము..అరేయ్
ఓరోరీ గుంటనక్క ఊరేగే ఊరకుక్క 
మా జోలికి వచ్చావంటే గోరీ కట్టిస్తాం 
నీకు గోరీ కట్టిస్తాం..రేయ్    
  
 చరణం::3
    
పామువు నీవు..చీమలు మేము 
నీ పని పట్టిస్తాం..నీ పని పట్టిస్తాం 
నీ బండారం బయటికి లాగి 
నిను తుదముట్టిస్తాం..నిను తుదముట్టిస్తాం
బడాచోరువని దగాకోరువని తరిమి తరిమి కొడతాం..రేయ్   
ఓరోరీ గుంటనక్క ఊరేగే ఊరకుక్క మా జోలికి వచ్చావంటే 
గోరీ కట్టిస్తాం నీకు..గోరీ కట్టిస్తాం..రేయ్  
గుంటనక్కోయ్..ఊరకుక్కోయ్ గుంటనక్కోయ్ 
ఊరకుక్కోయ్ గుంటనక్క ఊరకుక్కోయ్

No comments: