సంగీతం::S.P.కోదండపాణి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,పద్మనాభం,రాజబాబు,జానకి,జయంతి,రమాప్రభ,నిర్మల
పల్లవి::
ఎవరిని అడగాలి..బాపూ ఏమని అడగాలి
మూగ గుండెలో రగిలే బాధ మూగగానే మిగలాలి
ఎవరిని అడగాలి..బాపూ ఏమని అడగాలి
చరణం::1
సిరిమల్లెల విరియించే వసంతం..చిగురాకులనే రాల్చేస్తే
సిరిమల్లెల విరియించే వసంతం..చిగురాకులనే రాల్చేస్తే
నావను నడిపే చుక్కాని..ఆ..నావను తానే ముంచేస్తే
ఎవరిని అడగాలి..బాపూ ఏమని అడగాలి
చరణం::2
వలపులు పోసి పెంచిన తీవే..కాలసర్పమై కాటేస్తే
వలపులు పోసి పెంచిన తీవే..కాలసర్పమై కాటేస్తే
మమతలు పంచిన పాల మనసే..మనసును కాస్తా విరిచేస్తే
ఎవరిని అడగాలి..బాపూ ఏమని అడగాలి
చరణం::3
రాయిని తీసి రవ్వగ చేసి..నా యెదపైనే నిలిపానే
రాయిని తీసి రవ్వగ చేసి..నా యెదపైనే నిలిపానే
ఆ రవ్వయె తానొక నిప్పురవ్వయై..నా యెదనే కాల్చేస్తే
ఎవరిని అడగాలి..బాపూ ఏమని అడగాలి
మూగ గుండెలో రగిలే బాధ..మూగగానే మిగలాలి
ఎవరిని అడగాలి..బాపూ ఏమని అడగాలి
No comments:
Post a Comment