సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల, P.సుశీల
తారాగణం::అక్కినేని, జమున, S.V. రంగారావు, రాజసులోచన,రమణారెడ్డి
పల్లవి::
రావే ముద్దుల రాధా
నా ప్రేమ రాధివి నీవెగ
నవ రత్నాల రాశివి నీవెగ
పోవయ్యా శ్రీకృష్ణా..ఆ
నీ సరసాలన్నీ మాయలే
నువు దూరాన వుంటే మేలులే
చరణం::1
వనితలెవ్వరు నీసాటి రారే
నిన్నె నిరతము నే కోరినానే
వనితలెవ్వరు నీసాటి రారే
నిన్నె నిరతము నే కోరినానే
కోపమేల దయగను బాలా
తాపమింక నే తాళజాల
చరణం::2
మనసు నిలకడ కొంతైన లేదా
తరుణి తరుణితొ ఈ ఆటలేనా
మనసు నిలకడ కొంతైన లేదా
తరుణి తరుణితొ ఈ ఆటలేనా
చాలు చాలును ఈ మాటలేల
నీటి మూటలు నేనమ్మజాల
రావే ముద్దుల రాధా..ఆ
నా ప్రేమ రాధివి నీవెగ
నవ రత్నాల రాశివి నీవెగ
పోవయ్యా శ్రీకృష్ణా..ఆ
నీ సరసాలన్నీ మాయలే
నువు దూరాన వుంటే మేలులే
No comments:
Post a Comment