Monday, August 08, 2011

కన్యాకుమారి--1977





సంగీతం::S.P.బాలసుబ్రహ్మణ్యం
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల 

పల్లవి:: 

తొలిసంధ్యకు..తూరుపు ఎరుపు
మలిసంధ్యకు..పడమర ఎరుపు 
తెలియదు నాకు..పడమర తూరుపు 
తెలిసిందొకటే ఎరుపు..నా..ఆ..చెలియ పెదవి ఎరుపు 

తొలిసంధ్యకు..తూరుపు ఎరుపు
మలిసంధ్యకు..పడమర ఎరుపు 

చరణం::1

ఇరుసంజెల..పిలుపుల నడుమ 
మరుమల్లెల..వలపే మనది 
ఇరు పెదవుల..ఎరుపుల నడుమ 
చిరునవ్వుల..పిలుపే మనది 

తొలిసంధ్యకు..తూరుపు ఎరుపు
మలిసంధ్యకు..పడమర ఎరుపు 

చరణం::2

సిరివెన్నెలొలుకు..సిగమల్లె తెలుపు 
చిరునవ్వులోని..మరుమల్లె తెలుపు 
తొలిరోజులందు..చెలిమోజులందు 
విరజాజులన్ని..తెలుపు 
అరమూత కనుల..నును లేత వలపు 
తెర తీసి నాకు..పిలుపు 
తెలిగించి మనసు..తెలుపు

తొలిసంధ్యకు..తూరుపు ఎరుపు
మలిసంధ్యకు..పడమర ఎరుపు 

చరణం::3

చెలి కాటుక..మబ్బుల వెన్నెల 
తొలి కోరిక..మదిలో కోయిల
మన కలయిక..సంధ్యారాగం 
ప్రతి రాగం..జీవన రాగం

తొలిసంధ్యకు..తూరుపు ఎరుపు
మలిసంధ్యకు..పడమర ఎరుపు 
తెలియదు నాకు..పడమర తూరుపు 
తెలిసిందొకటే ఎరుపు..నా చెలియ పెదవి ఎరుపు 
తొలిసంధ్యకు..తూరుపు ఎరుపు
మలిసంధ్యకు..పడమర ఎరుపు

No comments: