Saturday, March 19, 2011

డబ్బుకు లోకం దాసోహం--1973























సంగీతం::K.V.మహదేవన్
రచన::సినారె  
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు, జమున, S.V.రంగారావు 

పల్లవి:: 

నువ్వూ..నేనూ..నడిచింది..ఒకే బాట ఒకే బాట
నువ్వూ..నేనూ..పలికింది..ఒకే మాట ఒకే మాట

ఆ బాట రెండుగా చీలిపోయెనా..ఆ..ఆ 
మాట నేటితో తీరిపోయెనా..
ఆ బాట రెండుగా చీలిపోయెనా..ఆ..ఆ 
మాట నేటితో తీరిపోయెనా..ఆ

నువ్వూ..నేనూ..నడిచింది..ఒకే బాట ఒకే బాట

చరణం::1

మంచు పొగలు ముసిరితే..సూర్యోదయమాగునా
మనసు పొరలు కమ్మితే..అసలు నిజం దాగునా

మంచు పొగలు ముసిరితే..సూర్యోదయమాగునా
మనసు పొరలు కమ్మితే..అసలు నిజం దాగునా

ఆ కిరణాలుదయిస్తే..ఆ నిజమే ఋజువైతే
కమ్ముకున్న తెరలన్నీ..కరిగి పోక ఆగునా..ఆ
కరిగిపోక ఆగునా....

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హు..
నువ్వూ..నేనూ..నడిచింది..ఒకే బాట ఒకే బాట

చరణం::2

మచ్చలేని చెలికాడొకడున్నాడని
అతని మమతలన్ని నీ పైనే ఉన్నాయని
మచ్చలేని చెలికాడొకడున్నాడని
అతని మమతలన్ని నీ పైనే ఉన్నాయని

నీ నరాల తీగలపై నిజమేదో పలుకునులే
నీ నరాల తీగలపై నిజమేదో పలుకునులే

నీ మనసు అద్దంలో..నా బొమ్మ నిలుచునులే..ఏ
నా బొమ్మే నిలుచునులే.....

నువ్వూ..నేనూ..నడిచింది..ఒకే బాట ఒకే బాట
నువ్వూ..నేనూ..పలికింది..ఒకే మాట ఒకే మాట

No comments: