Thursday, January 16, 2014

ఆరాధన--1976





















సంగీతం::సాలూరి హనుమంత రావు 
రచన::సినారె 
గానం::రఫీ ,S.జానకి 
తారాగణం::N.T. రామారావు, వాణిశ్రీ, జగ్గయ్య,గుమ్మడి,ప్రభాకరరెడ్డి,రాజనాల 

పల్లవి::

నేడే తెలిసింది..ఈ నాడే తెలిసింది
నేడే తెలిసింది..ఈ నాడే తెలిసింది
కమ్మని కళకే..రూపం వస్తే
కమ్మని కళకే..రూపం వస్తే
అది నీ లాగే..ఉంటుందని
నేడే తెలిసింది..ఈ నాడే తెలిసింది

నేడే తెలిసింది..ఈ నాడే తెలిసింది
నేడే తెలిసింది..ఈ నాడే తెలిసింది
తియ్యని పాటకు..ప్రాణం వస్తే
తియ్యని పాటకు..ప్రాణం వస్తే
అది నీ లాగే..ఉంటుందని
నేడే తెలిసింది..ఈ నాడే తెలిసింది

చరణం::1

ఇంత మంచి రూపానికి..అంత మంచి మనసుంటుందనీ
ఇంత మంచి రూపానికి..అంత మంచి మనసుంటుందనీ
ఆ మనసున అంతరాలకూ..తావన్నది లేనేలేదనీ
ఆ మనసున అంతరాలకూ..తావన్నది లేనేలేదనీ
అది వలచేదొకసారేనని ఆ..వలపే విడిపోలేనిదనీ 
నేడే తెలిసింది..ఈ నాడే తెలిసింది

చరణం::2

ఆఆఆఆఆఆఆఆఆ..ఆఆఆఆఆఆఆఆఆ  
మారుమూల పల్లెలోనా మధురగానముదయించేనని
మారుమూల పల్లెలోనా మధురగానముదయించేనని
శిలలకైనా ఆ గానం పులకింతలు కలిగించేనని
శిలలకైనా ఆ గానం పులకింతలు కలిగించేనని
అది జతగా నను చేరాలని..నా బ్రతుకే శృతి చేయాలని

నేడే తెలిసింది..ఈ నాడే తెలిసింది
కమ్మని కళకే..రూపం వస్తే
అది నీ లాగే..ఉంటుందని
నేడే తెలిసింది..ఈ నాడే తెలిసింది 
ఆఆ..తియ్యని పాటకు..ప్రాణం వస్తే 
అది నీ లాగే..ఉంటుందని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది

No comments: