సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::పింగళి నాగేంద్ర రావు
గానం::ఘంటశాల.P.సుశీల
రాగం::బౄందావన సారంగ
ఆ : :- నీ లీలలోనే ఒక హాయిలే...
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే.. !
అ : నీ లీలలోనే ఒక హాయిలే...
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే.. !
అ : నీవున్నచోటే స్వర్గాలుగా...
భువనాలనేల నాకేలనే...
ఆ : దివినైన ఏలే పతివుండగా...ఆ...
ఏవైభవాలు నాకునూ...ఏలలే...
ఇద్దరు : నీ లీలలోనే ఒక హాయిలే...
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే.. !!!
ఆ.....ఆ...అహా...ఒహోహో...అహా......
ఒహోహో...అహా.....ఒహో....ఒహోహో....
అ : నావిందు నీవై చెలువొందగా
ఏ చందమామో నాకేలనే...
ఆ : నా వెలుగు నీవైవిలాసిల్లగా
ఏ వెన్నెలైన నాకునూ...ఏలలే....
ఇద్దరు : నీ లీలలోనే ఒక హాయిలే...
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే..
అ : నీవలపు వాహినిలో నే తేలగా...
ఏ కేళీఇనా నాకేలనే ...
ఆ : నీప్రేమ లాహిరిలో నే సోలగా ..
ఏ లాలనైన నాకునూ... ఏలలే....
ఇద్దరు : నీ లీలలోనే ఒక హాయిలే...
నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే..!!!
No comments:
Post a Comment