సంగీతం::K.V.మహదేవన్
రచన::కొసరాజు
గానం::ఘంటసాల
పల్లవి::
చీరగట్టి సింగారించి..చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా
చిన్నదానా..ఆఆఅ..హోయ్

చక్కదనముతో సవాలు జేసే..చుక్కలాంటి చిన్నదానా

చరణం::1
ఒయ్యారము ఒలకబోసినావా..వాలుచూపులతో గాలమ్ము వేసినావా

పెళ్ళికొడుకును పట్టినావా..పెళ్ళికొడుకును పట్టినావా
ఓసి కోడలుపిల్లా..ఛాన్సు కొట్టినావా
చీరగట్టి సింగారించి..చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే..చుక్కలాంటి చిన్నదానా
చిన్నదానా..ఆఆఅ..హోయ్
చరణం::2
చందమామవంటి భలే అందగాడు..బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు

నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు..నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు
ఏడాది తిరగకుండ వచ్చు..ఏడాది తిరగకుండ వచ్చు చిన్నవాడు
చీరగట్టి సింగారించి..చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు..జేసే చుక్కలాంటి చిన్నదానా
చిన్నదానా..ఆఆఅ..హోయ్
చరణం::3
ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం

వలపు దాచావంటే పరితాపం..వలపు దాచావంటే పరితాపం
అది పైకి చెప్పుకుంటేనే ఉల్లాసం
చీరగట్టి సింగారించి..చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే..చుక్కలాంటి చిన్నదానా
చిన్నదానా..ఆఆఅ..హోయ్
No comments:
Post a Comment