Wednesday, February 27, 2013

ఆడబ్రతుకు--1965






సంగీతం::విశ్వనాథన్ రామమూర్తి   
రచన::సినారె 
గానం::P. సుశీల , బృందం

పల్లవి::

ఆహా..అందముచిందే..హృదయ కమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా
అందుకునే..రాజొకడే   

ఆహా..అందముచిందే హృదయకమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా..అందుకునే..రాజొకడే
వేలతారకల బృందములోన..వెలిగే చందురుడొకడే
వెలిగే చందురుడొకడే..ఆ ఆ ఆ ఆ ఆ

ఆహా..అందముచిందే..హృదయ కమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా
అందుకునే..రాజొకడే

చరణం::1

వెన్నెలరేకుల..వాకిళ్లుతీసి
సన్నని వలపుల..సాంబ్రాణి వేసి 
వెన్నెలరేకుల..వాకిళ్లుతీసి
సన్నని వలపుల..సాంబ్రాణి వేసి
ఎదురు చూసేది..ఎవరికోసమే 
మదిలో దాగిన మరుని కోసమే 
మదిలో దాగిన మరుని కోసమే

ఆహా..అందముచిందే..హృదయ కమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా
అందుకునే..రాజొకడే

చరణం::2

ఆహా హా హా హా ఆహా ఆహా ఆహా
కత్తులు దూసి జడిపించువాడు
మెత్తని ప్రేమను సాధించలేడు
కన్నుల బాసలు తెలియనివాడు
కన్నియ మనసును గెలువగలేడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆహా..అందముచిందే..హృదయ కమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా
అందుకునే..రాజొకడే

ఆహా..అందముచిందే..హృదయ కమలం
అందుకునే రాజొకడే..ఆహాహాహా
అందుకునే..రాజొకడే

No comments: