Wednesday, February 27, 2013

ఆడబ్రతుకు--1965






సంగీతం::విశ్వనాథన్ రామమూర్తి,
రచనసినారె
గానం::P.B.శ్రీనివాస్ 

పల్లవి:: 

కనులు పలకరించెను..పెదవులు పులకించెను 
బుగ్గలపై లేత లేత..సిగ్గులు చిగురించెను 
కనులు పలకరించెను..పెదవులు పులకించెను

చరణం::1

నిన్ను నేను చూసేవేళా..నన్ను నీవు చూడవేలా 
నిన్ను నేను చూసేవేళా..నన్ను నీవు చూడవేలా 
నేను పైకి చూడగానే..నీవు నన్ను చూతువేలా 
తెలిసిపోయె నీలో ఏదో..వలపు తొంగి చూసెను  
కనులు పలకరించెను..పెదవులు పులకించెను 
బుగ్గలపై లేత లేత..సిగ్గులు చిగురించెను

చరణం:2

మొలక నవ్వు దాచుకోకు..జిలుగుపైట జారనీకు 
మొలక నవ్వు దాచుకోకు..జిలుగుపైట జారనీకు
కురులు చాటు చేసుకోకు..తెరలు లేవు నీకు నాకు
తెలిసిపోయే నీలో ఏదో..వలపుతొంగి చూచెను 

కనులు పలకరించెను..పెదవులు పులకించెను 
బుగ్గలపై లేతలేత..సిగ్గులు చిగురించెను

చరణం::3

అందమైన ఈ జలపాతం..ఆలపించె తీయని గీతం 
ఓహో హో..ఓహో హో..ఓహో హో..ఓ ఓ ఓ ..
అందమైన ఈ జలపాతం..ఆలపించె తీయని గీతం
కనిపించని నీ హృదయంలో..వినిపించెను నా సంగీతం
తెలిసిపోయె నీలో ఏదో..వలపు తొంగి చూచెను   

కనులు పలకరించెను..పెదవులు పులకించెను 
బుగ్గలపై లేత లేత..సిగ్గులు చిగురించెను

No comments: