సంగీతం::విశ్వనాథన్ రామమూర్తి
రచన::ఆచార్య,ఆత్రేయ,
గానం::P.B.శ్రీనివాస్
పల్లవి::
తనువుకెన్ని గాయాలైనా..మాసిపోవునెలాగైనా
మనసుకొక్కగాయమైన..మాసిపోదు చితిలోనైనా
తనువుకెన్ని గాయాలైనా..మాసిపోవునెలాగైనా
మనసుకొక్కగాయమైన..మాసిపోదు చితిలోనైనా
చరణం::1
ఆడవాళ్లు ఆడుకునే ఆటబొమ్మ..ఈ మగవాడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆడవాళ్లు ఆడుకునే ఆటబొమ్మ..ఈ మగవాడు
ఆడుకున్న ఫరవాలేదు..పగులగొట్టి పోతారెందుకో
పగులగొట్టి పోతారెందుకో...
తనువుకెన్ని గాయాలైనా..మాసిపోవునెలాగైనా
మనసుకొక్కగాయమైన..మాసిపోదు చితిలోనైనా
చరణం::2
మగువులను పట్టించావే..మా సుఖమునకే అన్నావే
అందుకే ధర తెమ్మన్నావే..బ్రతుకే బలి ఇమ్మన్నావే
బ్రతుకే బలి ఇమ్మన్నావే...
తనువుకెన్ని గాయాలైనా..మాసిపోవునెలాగైనా
మనసుకొక్కగాయమైన..మాసిపోదు చితిలోనైనా
No comments:
Post a Comment