సంగీతం::విశ్వనాథన్ రామమూర్తి
రచన::సినారె
గానం::P.సుశీల
పల్లవి::
పిలిచే నా మదిలో..వలపే నీదెసుమా
పిలిచే నా మదిలో..వలపే నీదెసుమా
రారాజు ఎవరైనా..నారాజు నీవె సుమా
పిలిచే నా మదిలో..వలపే నీదెసుమా
రారాజు ఎవరైనా..నారాజు నీవె సుమా
పిలిచే నా మదిలో..వలపే నీదెసుమా
చరణం::1
ప్రేమయే దైవమని..భావించుకున్నాము
లోకమేమనుకున్నా..ఏకమైవున్నాము
చావైన బ్రతుకైనా..జంటగా వుందాము
పిలిచే నా మదిలో..వలపే నీదెసుమా
చరణం::2
చుక్కలే తెగిపోనీ..సూర్యుడే దిగిరానీ
చుక్కలే తెగిపోనీ..సూర్యుడే దిగిరానీ
ఈ ప్రేమ మారదులే..ఈ జ్యోతి ఆరదులే
ఈ ప్రేమ మారదులే..ఈ జ్యోతి ఆరదులే
ఎన్ని జన్మలకైనా..ఈ బంధముండునులే
పిలిచే నా మదిలో..వలపే నీదెసుమా
రారాజు ఎవరైనా..నారాజు నీవె సుమా
పిలిచే నా మదిలో..వలపే నీదెసుమా
No comments:
Post a Comment