Tuesday, December 27, 2011

గుణవంతుడు--1975




















సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు , P.సుశీల

పల్లవి:

నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది
నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది

నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది
నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది
నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది
నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది

చరణం::1

నీ పెదవులపై దరహాసం నాది..నా హృదయంలో స్థిరవాసం నీది
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నీ పెదవులపై దరహాసం నాది..నా హృదయంలో స్థిరవాసం నీది
నీవు లేక మా మనసుకు సొగసే లేదూ
నేను లేక నీ సొగసుకు మనసే లేదు

నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది
నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది

చరణం::2

నిను వేటాడే ఆశను నేను..నను వెంటాడే అందం నీవు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నిను వేటాడే ఆశను నేను..నను వెంటాడే అందం నీవు
నీ మొత్తం నా సొంతం అయ్యింది..ఈ..ఈ..ఈ
నీ మొత్తం నా సొంతం అయ్యింది..ఈ..ఈ..ఈ
ప్రతి నిత్యం అది కొత్తగ ఉంటుంది

నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది
నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది

నీవు గాక మరి ఎవరు నను కౌగిలిలో పొదిగేది
నేను గాక మరి ఎవరు నీ కన్నులలో మెదిలేది
లాలల లలలాలా..లాలలల లలలాలా
లాలల లలలాలా..లాలలల లలలాలా

No comments: