సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
పల్లవి::
మనసు మనసు కలిసినవేళే లగ్నంగా
మమత స్నేహం మాయని దీవెన సూత్రంగా
మన భాషలే మంత్రాలుగా..
మన ఆశలే..సాక్షాలుగా..
ప్రాణంలో ప్రాణంగా లీనమైనాముగా..
ప్రాణంలో ప్రాణంగా లీనమైనాముగా..
చరణం::1
పరువాల పాదుల్లో..ఆహా
సరసాల పందిట్లో..ఆహా
తీగల్లే నీవూ..నన్నల్లుకోగా..
ముచ్చట్లు మురిపాలు తీర్చుకోమా
పరువాల పాదుల్లో..
సరసాల పందిట్లో..
తీగల్లే నీవూ..నన్నల్లుకోగా..
ముచ్చట్లు మురిపాలు తీర్చుకోమా
నీ ప్రేమ భావలలోన..
నా ప్రణయ రాగాలలోనా..
మాటేనీవై..పాటేనేనై..గానం చేద్దామా
మాటేనీవై..పాటేనేనై..గానం చేద్దామా
మనసు మనసు కలిసినవేళే లగ్నంగా
మమత స్నేహం మాయని దీవెన సూత్రంగా
చరణం::2
స్వప్నాలే స్వర్గాలై..స్వర్గాలే సొంతాలై
ఈ నందనాన మందార మాలై
అందాల సందెళ్ళు తీర్చుకోనా..
స్వప్నాలే స్వర్గాలై..మ్..హు..
స్వర్గాలే సొంతాలై..ఆహా..
ఈ నందనాన మందార మాలై
అందాల సందెళ్ళు తీర్చుకోనా..
కౌగిళ్ళ సంకెళ్ళలోన..నూరేళ్ళ బంధాలలోనా
శృంగారంలో నింగినేల ఏకం చేద్దామా..
శృంగారంలో నింగినేల ఏకం చేద్దామా..
మనసు మనసు కలిసినవేళే లగ్నంగా
మమత స్నేహం మాయని దీవెన సూత్రంగా
మన భాషలే మంత్రాలుగా..
మన ఆశలే..సాక్షాలుగా..
ప్రాణంలో ప్రాణంగా లీనమైనాముగా..
ప్రాణంలో ప్రాణంగా లీనమైనాముగా..
No comments:
Post a Comment