Tuesday, December 27, 2011

రాజా-రమేష్--1977::సావేరి::రాగం





















సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::S.P.బాలు

సావేరి::రాగం 

{జోగియా--హిందుస్తానీ}

ఎంతో రసికుడు దేవుడు
ఎన్ని పువ్వులెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు
అన్నిటిలో నెన్నే చూడమన్నాడు

ఎంతో రసికుడు దేవుడు
ఎన్ని పువ్వులెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు
అన్నిటిలో నెన్నే చూడమన్నాడు

ఎంతో రసికుడు దేవుడు

పువ్వులన్నీ ఏరి..నీ బొమ్మ చేసినాడు
రంగులన్నీ రంగరించీ పూత పూసినాడు

పువ్వులన్నీ ఏరి..నీ బొమ్మ చేసినాడు
రంగులన్నీ రంగరించీ పూత పూసినాడు

ఆ ఘుమఘుమలు కుమ్మరించి శ్వాస నింపినాడు
నీ శ్వాస నింపినాడూ
నీ పెదవులలో పూదేనియా పొదిగి తీర్చినాడూ


ఎంతో రసికుడు దేవుడు

నల్లని కురులలోకి మల్లెపూలు సొగసు
పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు
నల్లని కురులలోకి మల్లెపూలు సొగసు
పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు

ముద్దులొలుకు మోముకు..ముద్దబంతి పొందికా
మొత్తంగా ఏ పువ్వు..నీకు సాటి రాదుగా

ఎంతో రసికుడు దేవుడు
ఎన్ని పువ్వులెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు
అన్నిటిలో నెన్నే చూడమన్నాడు
ఎంతో రసికుడు దేవుడు


No comments: