సంగీతం::పెండ్యాల నాగేశ్వర్ రావు
రచన::దాశరథి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,జమున,జగ్గయ్య,అంజలీదేవి,పద్మనాభం,రమణారెడ్డి,చంద్రమోహన్,రామకృష్ణ,గీతాంజలి.
పల్లవి::
ఏ శుభ సమయంలో..ఈ కవి హృదయంలో
నీ కాలి అందెలు మోగినావో..ఎన్నెని ఆశలు పొందినవో
ఏ శుభ సమయంలో..ఈ చెలి హృదయంలో
నీ ప్రేమ గీతం పలికిందో..ఎన్నెన్ని మమతలు చిలికిన్దొ
అహా అహా..అహా అహా..అహాహా అహాహా ఆ హా హ.
చరణం::1
కలలో నీవె ఊర్వసివే ఇలలో నీవె ప్రేయసివే
ఆ..ఆ..ఆ..నీడె లేని నాకోసం తొడై ఉన్న దేవుడవే
చిక్కని చీకటి లోన అతి చక్కని జాబిలి నీవె
ఏ శుభ సమయంలో..ఈ కవి హృదయంలో
నీ కాలి అందెలు మోగినావో..ఎన్నెని ఆశలు పొందినవో
చరణం::2
మనిషై నన్ను దాచావు..కవివై మనసు దోచావు
నిన్నే గెలుచుకున్నాను..నన్నే తెలుసు కున్నాను
పందిరి నోచని లతకు..నవ నందన మైతివి నీవె
ఏ శుభ సమయంలో..ఈ కవి హృదయంలో
నీ కాలి అందెలు మోగినావో..ఎన్నెని ఆశలు పొందినవో
చరణం::3
నీలో వీరిసే హరివిల్లు..నాలోకురిసే విరిజల్లు
కనులే కాంచే స్వప్నాలు..నిజమై తొచే స్వర్గాలు
నవ్వుల ఊయల లోనే..నా యవ్వన శోభవు నీవె
ఏ శుభ సమయంలో..ఈ కవి హృదయంలో
నీ కాలి అందెలు మోగినావో..ఎన్నెని ఆశలు పొందినవో
No comments:
Post a Comment