సంగీతం::T.V.రాజు
రచన::సముద్రాల
గాత్రం::P.లీల,ఘంటసాల
నిర్మాత::తివిక్రమరావు
దర్శకత్వం::యోగానంద్
తారాగణం::రామారావు,కాంతారావు,అంజలీదేవి,వహీదా రెహమాన్
పల్లవి::
ఈనాటి ఈహాయి కలకాదోయి నిజమోయి
ఈనాటి ఈహాయి కలకాదోయి నిజమోయి
ఈనాటి ఈహాయి..ఈ..
చరణం::1
నీ ఊహతోనే పులకించిపోయే..ఈ మేను నీదోయి..ఈ..
నీ ఊహతోనే పులకించిపోయే..ఈ మేను నీదోయి
నీకోసమే ఈ అడియాశలన్ని
నా ధ్యాస నా ఆశ నీవే సఖ
ఈనాటి ఈహాయి..కలకాదోయి నిజమోయి
ఈనాటి ఈహాయి..ఈ..
చరణం::2
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో ఈ ప్రేమ జవరాల..ఆ..
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో ఈ ప్రేమ జవరాల
మనియేములే..ఇక విరితావిలీల
మన ప్రేమకెదురేది..లేదే సఖి
ఈనాటి ఈహాయి..కలకాదోయి నిజమోయి
ఈనాటి ఈహాయి
చరణం::3
ఊగేములే తులతూగేములే..ఇక తొలిప్రేమ భోగాల..ఆఆ..
ఊగేములే తులతూగేములే..ఇక తొలిప్రేమ భోగాల
మురిపాల తేలే..మన జీవితాలు
మురిపాల తేలే..మన జీవితాలు
దరహాస లీలావిలాసాలులే..ఏ..
ఈనాటి ఈహాయి కలకాదోయి నిజమోయి
ఈనాటి ఈహాయి కలకాదోయి నిజమోయి..ఈ..
ఈనాటి ఈహాయి
No comments:
Post a Comment