Sunday, December 15, 2013

మనసు-మాంగల్యం--1971




సంగీతం::పెండ్యాల నాగేశ్వర్ రావు
రచన::దాశరథి
గానం::ఘంటసాల 
తారాగణం::అక్కినేని,జమున,జగ్గయ్య,అంజలీదేవి,పద్మనాభం,రమణారెడ్డి,చంద్రమోహన్,రామకృష్ణ,గీతాంజలి.

ఆవేశం రావాలి ఆవేదన కావాలి
ఆవేశం రావాలి..ఆవేదన కావాలి
గుండెలోని గాయాలు మండించే గేయాలు
గుండెలోని గాయాలు మండించే గేయాలు
వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు..రగలాలి విప్లవాలు
ఆవేశం రావాలి..ఆవేదన కావాలి

నరజాతిని భవితవ్యానికి నడిపేదే ఆవేశం
పదిమందికి భవితవ్యాన్ని పంచేదే ఆవేదన
వేగంతో వేడిమితో సాగేదే జీవితం..సాగేదే జీవితం
ఆవేశం రావాలి..ఆవేదన కావాలి

రణదాహం ధనమోహం కాలి కూలిపోవాలి
సమవాదం నవనాదం ప్రతి ఇంటా పలకాలి
ప్రతి మనిషీ క్రాంతి కొరకు రుద్రమూర్తి కావాలి..రుద్రమూర్తి కావాలి
ఆవేశం రావాలి..ఆవేదన కావాలి

తరతరాల దోపిడీల ఉరితాళ్ళను తెగతెంచి
నరనరాల అగ్నిధార ఉప్పెనలా ఉరికించి
మరో కొత్త ప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలీ 
నిదురించిన నా కవితను కదలించిన ఆవేశం
మరుగు పడిన నా మమతకు తెర విప్పిన ఆవేదన
కన్నుగప్పి వెళ్ళింది నన్ను మరచిపోయింది..నన్ను మరచిపోయింది

No comments: