Monday, March 25, 2013

దసరాబుల్లోడు--1971



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల   
తారాగణం::నాగేశ్వర రావ్ , వాణీశ్రీ , చంద్రకళ 

పల్లవి::

రాధ::చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని

గోపి::చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మరిపోవని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మరిపోవని
రాధ::చేతిలో చెయ్యేసి చెప్పు బావా

చరణం::1

రాధ::పాడుకున్న పాటలు పాతబడి పోవనీ
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వననీ
పాడుకున్న పాటలు పాతబడి పోవనీ
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వననీ

గోపి::పడుచు గుండె బిగువులు సడలి  పోనివ్వనని
పడుచు గుండె బిగువులు సడలి  పోనివ్వనని
దుడుకుగ వురికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని   

రాధ::చేతిలో చెయ్యేసి చెప్పు బావా
గోపి::చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మరిపోవని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా

చరణం::2

రాధ::కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి
గోపి::మనకధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి
రాధ::కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి
గోపి::మనకధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి

రాధ::మనజంట జంటలకే కన్నుకుట్టుకావాలి
మనజంట జంటలకే కన్నుకుట్టుకావాలి
గొపి::ఇంక ఒంటరిగా వున్న వాళ్ళు..జంటలైపొవాలి

రాధ::చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని

గోపి::చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మరిపోవని
రాధ::చేతిలో చెయ్యేసి చెప్పు బావా 

No comments: