Showing posts with label నిండు సంసారం--1968. Show all posts
Showing posts with label నిండు సంసారం--1968. Show all posts

Sunday, October 14, 2012

నిండు సంసారం--1968::శుద్ధకల్యాణి::రాగం





సంగీతం::మాస్టర్ వేణు
రచన::ఆరుద్ర 
గానం::P.సుశీల

శుద్ధకల్యాణి::రాగం
{మోహనకల్యాణి కూడ చూడండి }

పల్లవి::

దేవుడున్నాడా?
ఉంటే నిదుర పోయాడా?
దారుణాలు చూడలేక
రాయిలాగ మారాడా?
దేవుడున్నాడా?

మారలేదు చందమామ
మారలేదు సూర్యబింబం
జగతిలోన మార్పులేదు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగతిలోన మార్పులేదు
మనిసి ఏల మారిపోయె?
దేవుడున్నాడా?

చరణం::1

లోకాన బాధలన్నీ
మా కొరకే ఏకమాయె
లోకాన బాధలన్నీ
మా కొరకే ఏకమాయె
కష్టాలు మమ్ము చూసి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కష్టాలు మమ్ము చూసి
పండుగలే చేసుకున్నాయి
దేవుడున్నాడా?

చరణం::2

నీతికేమి ఫలితంలేదు
స్వార్థానికి విజయం నేడు
కనరాదు ఆశాకిరణం
ఆ ఆ ఆ ఆ ఆ 
కనరాదు ఆశాకిరణం
వలదింక పాడులోకం
దేవుడున్నాడా?

నిండు సంసారం--1968





సంగీతం::మాస్టర్ వేణు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల

పల్లవి::

ఎవరికీ తలవంచకు..
ఎవరినీ యాచించకు
గుండెబలమే నీ ఆయుధం..
నిండుమనసే నీ ధనం
ఎవరికీ తలవంచకు..
ఎవరినీ యాచించకు

చరణం::1

కండలు పిండే కష్టజీవులకు
తిండికి కరువుంటుందా?
కండలు పిండే కష్టజీవులకు
తిండికి కరువుంటుందా?
నిజాయితీకై నిలిచేవారికి
పరాజయం ఉంటుందా?
మంచితనమ్మును మించిన పెన్నిధి
మంచితనమ్మును మించిన పెన్నిధి
మనిషికి వేరే ఉందా?..మనిషికి వేరే ఉందా?

ఎవరికీ తలవంచకు..
ఎవరినీ యాచించకు

చరణం::2

చాలీచాలని జీతంతో
మిడిమేలపు కొలువులు కొలవకు
చాలీచాలని జీతంతో
మిడిమేలపు కొలువులు కొలవకు
ముడుచుకుపోయిన ఆశలతో..హోయ్
మిడిమిడి బ్రతుకును గడపకు
ముడుచుకుపోయిన ఆశలతో..హోయ్
మిడిమిడి బ్రతుకును గడపకు
చీకటి రాజ్యం ఎంతోకాలం
చెలాయించదని మరవకు 
చెలాయించదని మరవకు

ఎవరికీ తలవంచకు..
ఎవరినీ యాచించకు

చరణం::3

జీవితమే ఒక వైకుంఠపాళి
నిజం తెలుసుకో భాయీ
జీవితమే ఒక వైకుంఠపాళి
నిజం తెలుసుకో భాయీ
ఎగరేసే నిచ్చెనలే కాదు
పడదోసే పాములు ఉంటాయి
చిరునవ్వులతో విషవలయాలను
ఛేదించి ముందుకు పదవోయి
ఛేదించి ముందుకు పదవోయి

ఎవరికీ తలవంచకు..
ఎవరినీ యాచించకు
గుండెబలమే నీ ఆయుధం..
నిండుమనసే నీ ధనం
ఎవరికీ తలవంచకు..
ఎవరినీ యాచించకు