Sunday, July 22, 2012

బొబ్బిలి పులి--1982



సంగీతం::J.V.రాఘవులు
రచన::దాసరి
గానం::S.P.బాలు


శ్లోకం::
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్క్రుతాం
ధర్మ సంస్తాపనార్దాయ సంభవామి యుగే యుగే

పల్లవి::

సంభవం నీకే సంభవం...సంభవం నీకే సంభవం
ధర్మానికి నువ్వే రాజువై..న్యాయానికి నువ్వే మూర్తివై
ధర్మానికి నువ్వే రాజువై..న్యాయానికి నువ్వే మూర్తివై
అవినీతినే అణచివెయ్..అన్యాయమే తుడిచివెయ్
అది నీకే సంభవం..సంభవం సంభవం

చరణం::1

తల్లి కడుపు పండగా..పుట్టినావు కొడుకుగా
తల్లి కట్టే కాలగా..చేరినావా కాటికి
చెల్లి వలపు పంటగా..వీడినావు ప్రేమని
చెల్లి గుండె రగలగా..ఆర్పినావా మంటను
ఆ రగిలే మంటలు ఎక్కడివి???
ఆ పగిలే గొంతులు ఎవ్వరివి???
నీ తల్లివా నీ చేల్లివా...నీ తల్లివా నీ చేల్లివా
దిక్కులేని అనాధలవా..రోడ్డు పక్క అభాగ్యులవా
ఆ పాపుల పాలిటి..పులివై బెబ్బులివై
బొబ్బిలిపులివై..బొబ్బిలిపులివై సాగిపో..
సంభవం నీకే సంభవం...సంభవం నీకే సంభవం

రక్తానికి రక్తం సిద్దాంతం
ప్రాణానికి ప్రాణం సమాధానం
గుండెకు గుండె మార్పిడి
స్వార్ధానికి స్వార్ధమే దోపిడీ
అసత్యానికి నాలుక కోసెయ్
అధర్మానికి చేతులు నరికెయ్
అన్యాయానికి అక్రమానికి..కాళ్ళు చేతులు తీసి
కన్నెపిల్లలను పిల్ల తల్లులను తార్చే
దిగజార్చే తెగమార్చే తార్పుడు గాళ్ళను
రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి
మసి పూసేసే కను మూసేసే దేశద్రోహులను
చీల్చాలి చెండాడాలి..చీల్చి చీల్చి చెండాడాలి

No comments: