Sunday, July 22, 2012

బొబ్బిలి పులి--1982

సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::S.P.బాలు, P.సుశీల

పల్లవి::

ఎడ్డెమంటే తెడ్డెమంటె
నడ్డి ఇరిగిపోతాది గూడు జారిపోతాదే పిల్లో
నీ గుండె చెదిరిపోతాదే పిల్లో.నీ గుండె చెదిరిపోతాదే పిల్లో

ఎడ్డెమంటే తెడ్డెమంటె
నడ్డి ఇరిగిపోతాది గుట్టు బయటపడతాది పిల్లగో
నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో..నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో

చరణం::1

వలపులో అలజడి వాటేసి నేనూపుకుంట
తొలకరి తొలిరుచి కాటేసి నే చూసుకుంట
కలయిక కల దిక కాదంటు కవ్వించుకుంట
మనుగడ ముడివడ లగ్గాలు పెట్టించుకుంట

జోరు మీద ఉన్నవాణ్ణి జోలపాటకాగనోణ్ణి
జోడు ఉన్న కోడెగాణ్ణి నీకు తగ్గ నీటుగాణ్ణి
కోరికుంటే చూసుకో సోకులాడి కొంటె దూకులాడి
నన్ను ముద్దులాడి

ఎడ్డెమంటే తెడ్డెమంటె
నడ్డి ఇరిగిపోతాది గుట్టు బయటపడతాది పిల్లగో
నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో..నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో

ఎడ్డెమంటే తెడ్డెమంటె
నడ్డి ఇరిగిపోతాది గూడు జారిపోతాదే పిల్లో
నీ గుండె చెదిరిపోతాదే పిల్లో.నీ గుండె చెదిరిపోతాదే పిల్లో

చరణం::2

అలిగినా తొలగినా అందాలు నేనందుకుంటా
కులుకులు తళుకులు చూపుల్లో ఆరేసుకుంటా
పరువపు ఉరవడి పాటల్లో పండించుకుంటా
పరుగిడి చెలి ఒడి సందేళ నే చేరుకుంటా
ఏరులాంటి చిన్నదాన్ని ఎవరులేక ఉన్నదాన్ని
ఎల్లువైన పడుచుదాన్ని పెళ్ళిగాని పిల్లదాన్ని
ఓపికుంటే ఆదుకో ఒడ్డులాగ
పూలచెండులాగ పక్కదిండు లాగా

ఎడ్డెమంటే తెడ్డెమంటె
నడ్డి ఇరిగిపోతాది గుట్టు బయటపడతాది పిల్లగో
నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో..నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో

హో..ఎడ్డెమంటే తెడ్డెమంటె
నడ్డి ఇరిగిపోతాది గుట్టు బయటపడతాది పిల్లగో
నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో..నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో

No comments: