Saturday, June 02, 2012
నడిపించు నా నావా నడిసంద్రమున దేవా
నడిపించు నా నావా నడిసంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ...
నా జీవిత తీరమునా నా అపజయ భారమునా
నలిగిన నా హృదయమునూ..నడిపించుము లోతునకూ..
నా యాత్మ విరబూయా..నా దీక్ష ఫలియింపా
నా నావలో కాలిడుమూ..నా సేవ చేకొనుమా..
నడిపించు నా నావా...
రాత్రంతయు శ్రమ పడినా..రాలేదు ప్రభూ జయము..
రహదారులు వెదికిననూ..రాదాయను ప్రతి ఫలము
రక్షించు నీ సిలువా..
నడిపించు నా నావా...
ఆత్మార్పణ చేయకనే..ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే..అరసెతి ప్రభు నీ కలిమి
ఆశా నిరాశాయే..ఆవేదన నిదురాయే..
ఆధ్యాత్మిక లేమి గని..అల్లాడ నా వలలు..
నడిపించు నా నావా..
ప్రభు మార్గము విడిచితిని..ప్రార్థించుత మానితిని
ప్రభు వాక్యము వదలితిని..పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో..ప్రావీణ్యమును పొందీ
ఫలహీనుడనై ఇపుడు..పాటింతు నీ మాటా..
నడిపించు నా నావా..
లోతైన జలములలో..లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి..లోపంబులు సవరించి
లోతున్న ఈవులలో..లోటైన నా బ్రతుకు
లోపించని అర్పణగా..లోకేశ చేయుమయా
నడిపించు నా నావా..
ప్రభు ఏసుని శిష్యుడనై..ప్రభు ప్రేమను పాడుకొనీ
ప్రకటింతును లోకములో..ఓ..పరిసుధుని ప్రేమ కథా..
పరమాత్మ ప్రోక్షణతో..పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబులు ప్రభు కొరకు..ప్రాణార్పణము చేతు
నడిపించు నా నావా...
naDipinchu naa naavaa..naDi sandramuna dEvaa
nava jeevana maargamunaa .. naa janma tariyimpaa...
naa jeevita teeramunaa naa apajaya bhaaramunaa
naligina naa hRdayamunU..naDipinchumu lOtunakU..
naa yaatma virabUyaa..naa deeksha phaliyimpaa
naa naavalO kaaliDumU..naa sEva chEkonumaaa..
naDipinchu naa naavaa...
raatrantayu Srama paDinaa..raalEdu prabhU jayamu..
rahadaarulu vedikinanU..raadaayanu prati phalamu
rakshinchu nee siluvaa..
naDipinchu naa naavaa...
aatmaarpaNa chEyakanE..aaSinchiti nee chelimi
ahamunu prEminchuchunE..araseti prabhu nee kalimi
aaSaa niraaSaayE..aavEdana niduraayE..
aadhyaatmika lEmi gani..allaaDa naa valalu..
naDipinchu naa naavaa..
prabhu maargamu viDichitini..praarthinchuta maanitini
prabhu vaakyamu vadalitini..paramaarthamu marachitini
prapancha naTanalalO..praaveeNyamunu pondii
phalaheenuDanai ipuDu..paaTintu nee maaTaa..
naDipinchu naa naavaa..
lOtaina jalamulalO..lOtuna vinabaDu swaramaa
lObaDuTanu nErpinchi..lOpambulu savarinchi
lOtunna iivulalO..lOTaina naa bratuku
lOpinchani arpaNagaa..lOkESa chEyumayaa
naDipinchu naa naavaa..
prabhu Esuni SiShyuDanai..prabhu prEmanu paaDukonii
prakaTintunu lOkamulO..O..parisudhuni prEma kathaa..
paramaatma prOkshaNatO..paripoorNa samarpaNatO
praaNambulu prabhu koraku..praaNaarpaNamu chEtu
naDipinchu naa naavaa...
Labels:
Christian Song...
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
This song written by Acharya Masilamani
Post a Comment