Saturday, June 02, 2012
ఓ పాపా లాలి--1991
సంగీతం::ఇళయరాజా
గాయకుడు::S.P.బాలు
మాటె రాని చిన్నదాని కళ్ళు పలికే వూసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమె నాకు పంచె జ్ఞపకాలు రా
రేగే మూగ తలపె వలపు పంటరా
మాటె రాని చిన్నదాని కళ్ళు పలికే వూసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమె నాకు పంచె జ్ఞపకాలు రా
రేగే మూగ తలపె వలపు పంటరా
వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె నింగిని పొడిచెను
కన్నె పిల్ల కలలే నా కిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరపించే
మాటె రాని చిన్నదాని కళ్ళు పలికే వూసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులొని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలు కొలిపె న చెలి పిలుపులు
సందె వేల పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే
మాటె రాని చిన్నదాని కళ్ళు పలికే వూసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమె నాకు పంచె జ్ఞపకాలు రా
రేగే మూగ తలపె వలపు పంటరా
మాటె రాని చిన్నదాని కళ్ళు పలికే వూసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
Labels:
ఓ పాపా లాలి--1991
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment