నిత్యసంగీత సాధకుడు ఇళయరాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు:::::>
నిత్యసంగీత సాధకుడు ఇళయరాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు:::::>
రాయినైనా కరిగించగల శక్తి ఆయన సంగీతానికి ఉంది. ఎంతటి దు:ఖంలో ఉన్నా ఆయన స్వరాలు మనసును తాకితే ఇక ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఎంతో వినసొంపైన స్వరాలను ఏరి కూర్చి పాటల మాలను కట్టే మ్యూజిక్ మ్యాస్ట్రో పద్మభూషన్ ఇళయరాజా .
నిత్య సంగీత సాధకుడుగా మన సంగీతానికి పాశ్చాత్య సంగీతం కూడా మేళవిస్తూ చక్కని బాణీలు కూర్చడం ఆయనకు అలవాటు అయింది. దాదాపు 3 దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన సంగీత నటరాజు ఇళయరాజ. ఇళయరాజ సంగీతం వింటుంటే ఎవరైనా సరే అమాంతం తన్మయత్వం అయిపోవాల్సిందే. అంతటి ఘనత ఆయనది. ఆయన ఇప్పటి వరకు నాలుగు వేల పాటలకు, ఎనిమిదివందల చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. ఆయన స్వరపరిచిన సుస్వరాలో తేలియాడని సంగీతాభిమాని ఉండరనడంలో అతిశయోక్తి కాదేమో.
పేరు లోనే లయ ఉన్న సంగీత స్వర మాంత్రికుడు ఇళయ రాజ. తన ప్రతి చిత్రంలోనూ… ప్రతి భావానికి ఓ భావగర్భితమైన స్వరాన్ని నేపధ్యసంగీతం లో అందిస్తారు.. ముఖ్యం గా… సాగర సంగమం లో కమల్, జయప్రద ల ప్రేమ సన్నివేశాలలో, స్వాతిముత్యం లో రాధిక కమల్ ని ఓ తల్లి లాగ చూసే సన్నివేశాలలో, గీతాంజలి లో … ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో… ఆఖరికి “శివ” లాంటి యాక్షన్ చిత్రం లో కూడా తన నేపధ్య సంగీతం ఉత్కం టత ని కలిగిస్తుంది.
"ఇళయరాజా ఒకసారి సన్నివేశాన్ని చూసిన వెనువెంటనే తనవద్ద ఉన్న సహాయకులకు, వాయిద్యకారులకు బాణీలు చెప్పడం మొదలు పెడతారు, వెంటనే వారంతా తమ తమ సూచనలను తీసుకుని వాయిద్యాల వద్దకు వెళ్తారు. "
పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మాత్రమే పరిమితమైన రాగాలను, తీగల వంటి వాయిద్య పరికరాలను, భారతీయ చిత్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగించిన వారిలో ఇళయరాజా ఆద్యుడు. ఇందు మూలంగా, వీరు చిత్రాలకు యెన్నో వైవిధ్యభరిత బాణీలను అందించగలిగారు. అంతే కాకుండా, వీరి బాణీలు మరియు నేపథ్య సంగీతం భారతీయ ప్రేక్షకులలో ఎంతో ప్రసిద్ధిగాంచి, వీరి పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేశాయి.
దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా మూడు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు.
సాధారణంగా ఇళయరాజా పాటలంటే కేవలం ట్యూన్ మాత్రమే విని ఊరుకునేలా ఉండవు. నేపథ్య సంగీతంలోని సూక్ష్మమైన మెరుపులు ఒకోసారి పల్లవీ, చరణాల అందాలను మించిపోతుంటాయి.
ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన "దళపతి" చిత్రంలోని "చిలకమ్మా చిటికెయ్యంగ" పాట బి.బి.సి. వారి 10 అత్యుత్తమ పాటల్లో ఒకటిగా ఎంపికైంది. టైమ్ మ్యాగజైన్ వారి అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎంపికైన నాయకుడు (1987) చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.
ఇళయరాజా "సాగర సంగమం" (1984), "సింధు భైరవి" (1985) మరియు "రుద్రవీణ" (1989) చిత్రాలకు గాను జాతీయ అత్యుత్తమ సంగీత దర్శకుడు పురస్కారాన్ని అందుకున్నారు. 2004 లో యన్.టి.ఆర్ జాతీయ పురస్కారం, 2010 లో పద్మభుషణ్ ఆవార్డు ఆందుకున్నారు.
రెహమాన్ ప్రవాహం లో తన వేగం తగ్గినా… ఈ మధ్య విడుదలైన ” చీని కమ్” లో ” జానే దో నా…” అన్న శ్రేయ ఘోషల్ పాట కాని, “ఓం శాంతి” లో ” చిన్న పోలికే లేదు ప్రేమా… నిన్నకూ నేటికి.. “, అన్న పాటలు వింటే… తనలో ఆ నాటి ఫ్రెష్నెస్స్ ఇంకా అలాగే ఉందని తెలిసిపోతుంది.
రచన:ములుకుట్ల. నరసింహావధానులు గారు
No comments:
Post a Comment