పల్లవి:: ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో ప్రణయ భావనకు ప్రథమ మూర్తివో ప్రణయ గగనమున ప్రథమ రేఖవో రేఖవో శశిరేఖవో సుధవో జయసుధవో..ఓ ఓ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చరణం::1
సరళ తరళ నీహార యవనికల మెరిసే సూర్య కళికా..ఆ ఆ మృదుల మృదుల నవ పవన వీచికల కదిలే మదన లతికా సరళ తరళ నీహార యవనికల మెరిసే సూర్య కళికా..ఆ ఆ మృదుల మృదుల నవ పవన వీచికల కదిలే మదన లతికా నీ లలిత చరణ పల్లవ చుంబనమున పులకించును వసుధ జయసుధా..ఆ..
ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో ప్రణయ భావనకు ప్రథమ మూర్తివో ప్రణయ గగనమున ప్రథమ రేఖవో రేఖవో శశిరేఖవో సుధవో జయసుధవో..ఓ ఓ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చరణం::2
శరదిందీవర చలదిందిందిర స్ఫురణదీలకుంతలవో ౠష్యాశ్రమ గతదుష్యంత చకిత దృషాంకిత శకుంతలవో అది నిటలమా సురుచిర శశాంక శకలమా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అవి కనుబొమలా రతీ మన్మధుల ధనువులా అది అధరమా అమృత సదనమా అది గాత్రమా జీవ చిత్రమా అది అధరమా అమృత సదనమా అది గాత్రమా జీవ చిత్రమా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.. నీ నయన లేఖినులు విరచించెను అభినవ రసమయ గాధ జయసుధా..ఆ...
ఈ పాట వినాలని ఉందా చిమ్మట లింక్ నొక్కండి సంగీతం::రమేష్‌నాయుడు రచన::దాసరినారాయణరావ్ గానం::P.సుశీల Film Directed By::Dasari Narayana Rao Cast::Jayasudha,Murali Mohan,Dasari Naryana Rao,Mohan Babu. పల్లవి:: గోరువెచ్చని సూరిడమ్మా పొద్దుపొడుపులో వచ్చాడమ్మా గోరువెచ్చని సూరిడమ్మా పొద్దుపొడుపులో వచ్చాడమ్మా వద్దన్నా రావద్దన్నా గు౦డెలో గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా చరణం::1 మిట్టమధ్యాహ్న౦ నడి నెత్తిన వచ్చాడు ఒ౦టరిగా పోతు౦టే ఎ౦టె౦ట పడ్డాడు ఇనకు౦డా పొతు౦టే అరిచరిచి పిలిచాడు ఆ..ఆ..ఆ.. పిలిచిపిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు ఎతికి ఎతికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు ఆ ఏడి దిగాల౦టే నా తోడు కావాల౦ట నేతోడు ఇస్తాన౦టే తను దిగి వస్తాడ౦ట
చరణం::2 పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు ఎనుతిరిగిపోతు౦టే ఎనకెనక పిలిచాడు పోని అని తిరిగితే ఎర్రెక్కి ఉన్నాడు అ..అ..అ ఆగి ఆగి అగలేక దిగి వచ్చానన్నాడు చూసి చూసి మత్తెక్కి పిచ్చెక్కి౦దన్నాడు ఆ పిచ్చి దిగాల౦టే నా తోడు కావాల౦ట నే తోడు ఇస్తాన౦టే పొమ్మన్నాపోడ౦ట