Tuesday, September 06, 2011

శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ--1966::కీరవాణి::రాగం





















సంగీతం::పెండ్యాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::S.జానకి
కీరవాణి::రాగం 

వల్లభా..ఆ..ఆ..ఆ..ప్రియ వల్లభా
వల్లభా..ఆ..ఆ..ఆ..ప్రియ వల్లభా
నాలో వలెనే నీలోనూ..జిలిబిలి ఊహలు సాగేనా
కలవరములు చెలరేగేనా..ఆ..ఆ..ఆ..ఆ

వల్లభా..ఆ..ఆ..ఆ..ప్రియ వల్లభా

అపుడే విరిసిన పూవులలో..ఒ..ఒ..ఒ..
అపుదే విరిసిన పూవులలో..గుప్పుమనే పరిమళమువలే
బుగ్గలకావిరి తగిలేలా..సిగ్గులుసెగలై చెలగేనా..ఆ..ఆ..ఆ..

వల్లభా..ఆ..ఆ..ఆ..ప్రియ వల్లభా

చంద్రుని చూసిన సంద్రములో..ఓ..ఓ..ఓ..
చంద్రుని చూసిన సంద్రములో
సందడి చేసే అలలవలే..కొల్లగ మమతలు మొంచేనా
చల్లగ వలపులు వీచేనా..ఆ..ఆ..ఆ

వల్లభా..ఆ..ఆ..ఆ..ప్రియ వల్లభా
వల్లభా..ఆ..ఆ..ఆ..ప్రియ వల్లభా
నాలో వలెనే నీలోనూ..జిలిబిలి ఊహలు సాగేనా
కలవరములు చెలరేగేనా..ఆ..ఆ..ఆ..ఆ
వల్లభా..ఆ..ఆ..ఆ..

No comments: