Tuesday, September 06, 2011

తల్లా పెళ్ళామా ?--1969


సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

ఓ..బంగారు గూటిలోని చిలుక
పేదముంగిట్లో వాలానని ఉలుకా
ఓ..బంగారు గూటిలోని చిలుక
పేదముంగిట్లో వాలానని ఉలుకా

ఓ..DON'T BE SILLY

ఓ..వగలొలుకు మగసిరి గోరింకా
తానై రా చిలుక వచ్చిందని కేరింత
ఓ..వగలొలుకు మగసిరి గోరింకా
తానై రా చిలుక వచ్చిందని కేరింత

పవళించగ పూల పానుపు లేదూ
తలవూనగ పట్టు తలగడయే లేదు
జలకలాడగ పన్నీరు లేదు
జలకలాడగ పన్నీరు లేదు
పరిచర్యలు చేయ చెలులైన లేరు
ఓ..బంగారు గూటిలోని చిలుక పేదముంగిట్లో వాలానని ఉలుకా

SWEETNESS OF THE ROSES..BRIGHTNESS OF THE SKY
SMILE IN THE MOON LIGHT..THRILL OF MY LIFE


మెత్తని నీమది విరిపాంపుకాదా
వెచ్చని కైదండ నా అండలేదా
మెత్తని నీమది విరిపాంపుకాదా
వెచ్చని కైదండ నా అండలేదా
కురిసే వెన్నెల పన్నీరుకాదా
కురిసే వెన్నెల పన్నీరుకాదా
కొండంత నీవుండ కోరిక లేలా

ఓ..వగలొలుకు మగసిరి గోరింకా
తానై రా చిలుక వచ్చిందని కేరింత
ఓ..బంగారు గూటిలోని చిలుక
పేదముంగిట్లో వాలానని ఉలుకా

No comments: