సంగీతం::R.D.బర్మన్
రచన::వేటూరి
డైరెక్టర్ బై::జంద్యాల
గానం::S.జానకి
పల్లవి::
మౌనమే ప్రియా..ధ్యానమై
మౌనమే ప్రియా..ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచే..నా ప్రేమ
మౌనమే ప్రియా..ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచే..నా ప్రేమ
మౌనమే ప్రియా..ధ్యానమై..ఈ..
మౌనమే ప్రియా..ధ్యానమై..
చరణం::1
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా మందారాలు
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా మందారాలు
పొద్దే తాంబూలాలై ఎర్రనాయే సంజెలన్నీ
పల్లవించే ఊహలన్నీ నా ప్రేమ బాటలాయె
ఈ దూరం దూరతీరం ముద్దులాడేదెన్నడో
మౌనమే ప్రియా..ధ్యానమై..
మౌనమే ప్రియా..ధ్యానమై..
చరణం::2
కన్నె చెక్కిళ్ళలో సందె గోరింటాకు
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు
కన్నె చెక్కిళ్ళలో సందె గోరింటాకు
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు
వచ్చే మాఘమాసం పందిరేసే ముందుగానే
నీవూ నేను పల్లకీలో ఊరేగే శుభవేళ
నీ చిత్తం నా భాగ్యం మనువాడేదెన్నడో
మౌనమే ప్రియా..ధ్యానమై..ఈ..
నీలి కన్నులా నిలిచి పిలిచే..నా ప్రేమ
మౌనమే ప్రియా..ధ్యానమై..ఈ..
మౌనమే ప్రియా..ధ్యానమై..
No comments:
Post a Comment