చిమ్మటలోని ఈ మెలోడి పాట మీకోసం
సంగీతం::R.D.బర్మన్
రచన::వేటూరి
డైరెక్టర్ బై::జంద్యాల
గానం::ఆశా భోంస్లే,బాలు
పల్లవి::
తరరా తరతరా తర తర తరా
జీవితం సప్తసాగర గీతం
వెలుగు నీడల వేగం
సాగని పయనం..మ్మ్
కల ఇల కౌగిలించే చోట
కల ఇల కౌగిలించే చోట
జీవితం సప్తసాగర గీతం
వెలుగు నీడల వేగం
సాగని పయనం
కల ఇల కౌగిలించే చోట
కల ఇల కౌగిలించే చోట
పపపపా పపపపా పపపపా
చఋఅణం::1
ఏది భువనం ఏది గగనం తారాతోరణం
ఈ చికాగో సిల్స్ టవరే స్వర్గసోపానము
ఏది సత్యఒ ఏది స్వప్నం నిజమీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ
హే..బ్రహ్మ మానసగీతం మనిషి గీసినచిత్రం
చేతనాత్మక శిల్పం
మతి కృతి పల్లవించే చోట
మతి కృతి పల్లవించే చోట
జీవితం సప్తసాగర గీతం
వెలుగు నీడల వేగం
సాగని పయనం..మ్మ్
కల ఇల కౌగిలించే చోట
కల ఇల కౌగిలించే చోట
చరణం::2
ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేఛ్ఛా జ్యోతులు
ఐక్యరాజ్య సమితిలోనా కలిసే జాతులు
ఆకశాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మియామీ బీచ్ కన్న ప్రేమ సామ్రాజ్యము
హే..సృష్టికే ఇది అందం
దృష్టి కందని దృశ్యం
కవులు రాయని కావ్యం
కృషి ఖుషి సంగమించే చోట
కృషి ఖుషి సంగమించే చోట
జీవితం సప్తసాగర గీతం
వెలుగు నీడల వేగం
సాగని పయనం..మ్మ్
కల ఇల కౌగిలించే చోట
కల..ఆ..ఇల..ఆ..కౌగిలించే చోట
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
No comments:
Post a Comment