Wednesday, November 30, 2011

ఇంద్ర ధనుస్సు --1978




చిమ్మటలోని ఈ పాట మీకోసం

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::Pసుశీల

ఏడు రంగుల..ఇంద్రధనస్సు
ఈడు వచ్చిన..నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన..
మల్లెరంగు నా మనసు
మల్లెరంగు నా మనసు

ఏడు రంగుల..ఇంద్రధనస్సు
ఈడు వచ్చిన..నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన..
మల్లెరంగు నా మనసు

పసిడి పసుపు..మేని రంగు
సందె ఎరుపు..బుగ్గ రంగు
నీలి రంగుల కంటిపాపల
కొసలలో నారింజ..సొగసులు
ఆకుపచ్చని పదారేళ్ళకు
ఆశలెన్నో రంగులు
ఆ ఆశలన్నీ ఆకాశానికి
ఎగసి వెలసెను ఇంద్రధనస్సై

ఏడు రంగుల..ఇంద్రధనస్సు
ఈడు వచ్చిన..నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన..
మల్లెరంగు నా మనసు

చరణం::2
ఎవ్వడే ఆఇంద్రధనస్సును..ఎక్కుపెట్టిన వీరుడు
ఎవ్వడే నాయవ్వనాన్ని..ఏలుకోగల మన్మధుడు
ఎవ్వడే ఆఇంద్రధనస్సును..ఎక్కుపెట్టిన వీరుడు
ఎవ్వడే నాయవ్వనాన్ని..ఏలుకోగల మన్మధుడు
వాడి కోసం వాన చినుకై..నిలిచి ఉంటానింగిలోనా
వాడి వెలుగే ఏడురంగుల..ఇంద్రధనస్సునా లో
ఇంద్రధనస్సునా లో...

ఏడు రంగుల..ఇంద్రధనస్సు
ఈడు వచ్చిన..నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన..
మల్లెరంగు నా మనసు

No comments: