చిమ్మటలోని ఈ పాట మీకు నచ్చితే ఇక్కడ క్లిక్ చేసి పాట వింటూ సాహిత్యం
చూడండి మరీ నచ్చితే చిన్నగా ఒక కామెంట్ రాయండి
సంగీతం::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు ,P. సుశీల
పల్లవి::
ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో
ప్రణయ భావనకు ప్రథమ మూర్తివో
ప్రణయ గగనమున ప్రథమ రేఖవో
రేఖవో శశిరేఖవో సుధవో జయసుధవో..ఓ
ఓ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చరణం::1
సరళ తరళ నీహార యవనికల
మెరిసే సూర్య కళికా..ఆ ఆ
మృదుల మృదుల నవ పవన వీచికల
కదిలే మదన లతికా
సరళ తరళ నీహార యవనికల
మెరిసే సూర్య కళికా..ఆ ఆ
మృదుల మృదుల నవ పవన వీచికల
కదిలే మదన లతికా
నీ లలిత చరణ పల్లవ చుంబనమున
పులకించును వసుధ జయసుధా..ఆ..
ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో
ప్రణయ భావనకు ప్రథమ మూర్తివో
ప్రణయ గగనమున ప్రథమ రేఖవో
రేఖవో శశిరేఖవో సుధవో జయసుధవో..ఓ
ఓ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చరణం::2
శరదిందీవర చలదిందిందిర స్ఫురణదీలకుంతలవో
ౠష్యాశ్రమ గతదుష్యంత చకిత దృషాంకిత శకుంతలవో
అది నిటలమా సురుచిర శశాంక శకలమా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అవి కనుబొమలా రతీ మన్మధుల ధనువులా
అది అధరమా అమృత సదనమా
అది గాత్రమా జీవ చిత్రమా
అది అధరమా అమృత సదనమా
అది గాత్రమా జీవ చిత్రమా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
నీ నయన లేఖినులు విరచించెను
అభినవ రసమయ గాధ
జయసుధా..ఆ...
2 comments:
ఆహా! ఏమి ఓపికండి బాబు.. మీ ఓపికకి నా జోహారులు..
శ్రీనాధ్ కన్న గారు, నా బ్లాగ్ సందర్శించి, కామెంట్ రాసినందుకు కృతజ్ఞతలు.. మీ పాటల ప్రపంచం చాలా బాగుంది.. ఉద్యోగ రీత్యా, నా యితర వ్యాపకాల వల్ల, ఏదో అప్పుడప్పుడు మాత్రమే ఇలా మన తెలుగు బ్లాగుల్లోకి రావడం, తిన్నది అరక్క ఏవేవో నా బ్లాగులో గీకడం, ఇతరుల బ్లాగులకి కామెంట్ రాయడం చేస్తుంటాను.. మరోసారి కలుద్దాం ఓ.కే బై..
Post a Comment