Sunday, December 11, 2011

జయసుధ--1982


ఈ పాట వినాలని ఉందా చిమ్మట లింక్ నొక్కండి
సంగీతం::రమేష్‌నాయుడు
రచన::దాసరినారాయణరావ్
గానం::P.సుశీల

Film Directed By::Dasari Narayana Rao
Cast::Jayasudha,Murali Mohan,Dasari Naryana Rao,Mohan Babu.

పల్లవి::

గోరువెచ్చని సూరిడమ్మా

పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
గోరువెచ్చని సూరిడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా రావద్దన్నా
గు౦డెలో గుడిసె వేసి అది గుడిగా చేసి
ఆ గుడిలో దాగున్నాడమ్మా


చరణం::1

మిట్టమధ్యాహ్న౦ నడి నెత్తిన వచ్చాడు

ఒ౦టరిగా పోతు౦టే ఎ౦టె౦ట పడ్డాడు
ఇనకు౦డా పొతు౦టే అరిచరిచి పిలిచాడు
ఆ..ఆ..ఆ..
పిలిచిపిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు
ఎతికి ఎతికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు
ఆ ఏడి దిగాల౦టే నా తోడు కావాల౦ట
నేతోడు ఇస్తాన౦టే తను దిగి వస్తాడ౦ట

చరణం::2


పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు

ఎనుతిరిగిపోతు౦టే ఎనకెనక పిలిచాడు
పోని అని తిరిగితే ఎర్రెక్కి ఉన్నాడు
అ..అ..అ
ఆగి ఆగి అగలేక దిగి వచ్చానన్నాడు
చూసి చూసి మత్తెక్కి పిచ్చెక్కి౦దన్నాడు
ఆ పిచ్చి దిగాల౦టే నా తోడు కావాల౦ట
నే తోడు ఇస్తాన౦టే పొమ్మన్నాపోడ౦ట

No comments: