Friday, September 30, 2011

యమగోల --1977



సంగీతం::చక్రవర్తి
రచన::శ్రీ శ్రీ
గానం::S.P.బాలు,కోరస్‌

తారాగణం::N.T.రామారావు,జయప్రద,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,నిర్మల,మంజుల,జయమాలిని

:::

అతడు::సమరానికి నేడే ప్రారంభం
యమరాజుకు మూడెను ప్రారబ్ధం

బృందం::సమరానికి నేడే ప్రారంభం
యమరాజుకు మూడెను ప్రారబ్ధం

అతడు::నరలోకమున కార్మిక శక్తికి
తిరుగే లేదని చాటిద్దాం

బృందం::ఇంక్విలాబ్‌..జిందాబాద్‌
కార్మిక సంఘం జిందాబాద్‌
లెఫ్ట్‌..రైట్‌..లెఫ్ట్‌..రైట్‌

అతడు::యముడి నిరంకుశ పాలన వద్దు
యమ అర్జెన్సీ ఇకపై రద్దు

బృందం::యముడి నిరంకుశ పాలన వద్దు
యమ అర్జెన్సీ ఇకపై రద్దు

అతడు::వెట్టిచాకిరికి తలపై మొట్టు
వెయ్యండర్రా అందరు ఒట్టు

బృందం::ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు

అతడు::భూలోకమె మన పుణ్యతీర్థమని

బృందం::భూలోకమె మన పుణ్యతీర్థమని
నరుడే గురుడని పూజిద్దాం
భూలోకం జిందాబాద్..భూలోకం జిందాబాద్
జయహో నరుడా..జయహో నరుడా

అతడు::సమరానికి నేడే ప్రారంభం
యమరాజుకు మూడెను ప్రారబ్ధం

అతడు::కోరలు కొమ్మలు మీకిక వద్దు
రంగుల తేడా లసలే వద్దు

బృందం::కోరలు కొమ్మలు మీకిక వద్దు
రంగుల తేడా లసలే వద్దు

జనతకు సమతను సాధించాలి
చట్టం మార్చే ఓటుండాలి

బృందం::ఓటు ఓటు ఓటు ఓటు

అతడు::ప్రజాస్వామ్యమును మన సౌధానికి

బృందం::ప్రజాస్వామ్యమును మన సౌధానికి
పునాది రాళ్ళను పరిచేద్దాం

బృందం::సమరానికి నేడే ప్రారంభం
యమరాజుకు మూడెను ప్రారబ్ధం

సమరానికి నేడే ప్రారంభం
యమరాజుకు మూడెను ప్రారబ్ధం

బృందం::నరలోకమున కార్మిక శక్తికి
తిరుగే లేదని చాటిద్దాం
విప్లవం వర్ధిల్లాలి..కార్మిక సఘం జిందాబాద్
భూలోకం జిందాబాద్..భూలోకం జిందాబాద్
జయహో నరుడా..జయహో నరుడా


Yamagola--1977
Music::K.Chakravarthy
Lyricist::Srirangam Srinivasarao
Singer's::S.P.BaluP & Chorus
Cast::N.T.Ramaravu,Jayaprada,Satyanarayana,Alluramalingayya,Nirmala,Manjula,Jayamalini.

:::

samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham
narakalokamuna karmika shakthiki 
thiruguledhani chaatidhdham
inkhilaf zindabadh..karmika sangam zindabadh
left right left right left right left right

yamudi nirankusha paalana vadhdhu
yema urgency ika pai radhdhu
yamudi nirankusha paalana vadhdhu
yema urgency ika pai radhdhu
vetti chaakiriki thala pai mottu
veyyandarra andharu vottu

vottu vottu vottu
bhulokame mana punya theerthamani
bhulokame mana punya theerthamani
narude gurudani poojidhdham
bhulokam zindabadh..bhulokam zindabadh
jaya ho naruda..jaya ho naruda
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham

koralu kommulu mekika vodhdhu
rangula thedalasale vodhdhu
koralu kommulu mekika vodhdhu
rangula thedalasale vodhdhu
janathaku samathanu saadhinchaali
chattam maarche vottundaali
votu votu votu
praja swamyamanu gana saudhaaniki
praja swamyamanu gana saudhaaniki
punaadhi raallanu parichedhdhamu
samaraaniki nede prarambham
yamaraaju ku moodenu prarabhdham


No comments: