Friday, September 30, 2011
మూగనోము--1969
సంగీతం::R.గోవర్ధన్
రచన::C.నారాయణ రెడ్డి ఆరుద్ర
గానం::ఘంటసాల,సుశీల
Jamuna::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పగడాల జాబిలి చూడు ..
పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
వేయి అందాల నా రాజు అందిన ఈ రోజు ఎందుకులే నెలరేడు
Anr::పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు
Anr::మనసు మనసు గుసగుసలాడెను..పెదవి పెదవి కువకువ లాడెను
మనసు మనసు గుసగుసలాడెను..పెదవి పెదవి కువకువ లాడెను
Jamuna::ఆకాశ దీపాలు శయినించెను..నా కళ్ళు నీకళ్ళు పయనించెను
ఆకాశ దీపాలు శయినించెను..నా కళ్ళు నీకళ్ళు పయనించెను
Anr::పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు
Jamuna::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
Anr::బంగరు మమతలు పొంగులు వారెను..కొంగులు రెండూ ముడివడిపోయెను
బంగరు మమతలు పొంగులు వారెను..కొంగులు రెండూ ముడివడిపోయెను
Jamuna::గుడిలోని దేవుడు దీవించెను నా జడలోని పూవులు తిలకించెను
గుడిలోని దేవుడు దీవించెను నా జడలోని పూవులు తిలకించెను
Anr::పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు
Labels:
Hero::A.N.R,
P.Suseela,
Singer::Ghantasaala,
మూగనోము--1969
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment