సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
రాగమాలిక::
హిందోళ..జయ్‌జయ్‌వంతి..చారుకేశి..
దర్భార్‌కానడ..సారంగ....
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అతడు::ఆడవె అందాల సుర భామినీ
ఆడవె అందాల సుర భామినీ
పాడవె కళలన్ని ఒకటేననీ
ఆడవె అందాల సుర భామినీ
గానమేదైన స్వరములొక్కటే
ఆమె::పనిపసా..నిసనిగా..రిపమగ
మపమగ..మగసని..సగనీ
అతడు::నాట్యమేదైన నడక ఒక్కటే
భాష ఏదైన భావమొక్కటే
అన్ని కళల పరమార్థమొక్కటే
అందరినీ రంజింప చేయుటే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అతడు::ఆడవె అందాల సుర భామినీ
అతడు::ఓహో రంభా! సకల కళానికురంభా
రాళ్ళనైనా మురిపించె జాణవట
అందానికి రాణివట
ఏదీ నీ హావభావ విన్యాసం
ఏదీ నీ నాట్యకళా చాతుర్యం
రంభ::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అరువది నాలుగు కళలందు మేటిని
అమర నాథునికి ప్రియవధూటిని
అరువది నాలుగు కళలందు మేటిని
అమర నాథునికి ప్రియవధూటిని
సరసాలలో ఈ సురశాలలో
సరసా..లలో ఈ సురశాలలో
సాటిలేని శృంగార వాటిని
నిత్యవినూతన రాగస్రవంతిని
రసివంతిని! జయ జయ వంతిని
అతడు::ఆడవె అందాల సుర భామినీ
పాడవె కళలన్ని ఒకటేననీ
ఆడవె అందాల సుర భామినీ
అతడు::ఓహో ఊర్వశీ! అపురూప సౌందర్య రాశీ
ఏదీ నీ నయన మనోహర నవరస లాస్యం
ఏదీ నీ త్రిభువన మోహన రూప విలాసం
ఊర్వశీ::మదనుని పిలుపే నా నాదము
స్మర కదన శాస్త్రమే నా వేదము
మదనుని పిలుపే నా నాదము
స్మర కదన శాస్త్రమే నా వేదము
కనువిందుగా కరుణని పొందుగా
కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము
అంతులేని శృంగార పిపాసిని
తరతరాల మీ ప్రేయసినీ..చారుకేశిని
అతడు::ఆడవె అందాల సుర భామినీ
పాడవె కళలన్ని ఒకటేననీ
ఆడవె అందాల సుర భామినీ
అతడు::ఓహో మేనకా! మదన మయాఖా
సాగించు నీ రాసలీల చూపించు శృంగార హేలా
మేనక::నగవులతో మేని బిగువులతో
నగవులతో మేని బిగువులతో
వగలొలికించు వయ్యారి నెరజాణను
ఏ చోట తాకినా!ఆ ఆ ఏ గోట మీటినా ఆ ఆ
మధువులొలికించి మరులు చిలికించు
మధురమైన రసవీణను
రతిరాజ కళా ప్రవీణను..సా..రంగలోచనను
అతడు::ఆడవె అందాల సుర భామినీ
పాడవె కళలన్ని ఒకటేననీ
ఆడవె అందాల సుర భామినీ
Yamagola--1977
Music::K.Chakravarthy
Lyricist::D.C.Narayanareddi
Singer's::S.P.BaluP ,P.Suseela
Cast::N.T.Ramaravu,Jayaprada,Satyanarayana,Alluramalingayya,Nirmala,Manjula,Jayamalini.
Raagamaalika
:::
aadave andaala surabhaamini
aadave andaala surabhaamini
paadave kalalanni okatenani
aadave andaala surabhaamini
gaana medhaina swaramulokkate
naatya medhaina nadaka okkate
bhaasha yedhaina baavamokkate
anni kalala parmaardhamokkate
andharini ranjipa cheyute
aa aa aaaa
aadave andaala surabhaamini
oho ramba sakala kala nikuramba
rallanaina murpinche dhanavata
andhaaniki ranivata
yedhi ni hava bhaava vinyaasam
yedhi ni natya kala chaathuryam
aa aa aaaa
:::1
aruvadhi nalugu kalalandhu metini
amaranadhuniki priya vadhuthini
aruvadhi nalugu kalalandhu metini
amaranadhuniki priya vadhuthini
sarasaalalo ee surashalalo
sarasaalalo ee surashalalo
satileni srungaara vatini
nithya vinothana raaga sravanthini
rasavanthini jaya jayavanthini
rasavanthini jaya jayavanthini
aadave andaala surabhaamini
paadave kalalanni okatenani
:::2
oho urvasi apurupa sondharya raasi
yedhi ni nayana manohara navarasa laasyam
yedhi ni thribuvana mohana rupa vilasam
madanuni pilupe naa naadhamu
smarakarana shaasthrame naa vedamu
madanuni pilupe naa naadhamu
smarakarana shaasthrame naa vedamu
kanu vindhu ga karunani pondhu ga
koti swargaalu chupinchu naa snehamu
anthuleni srungaara pipaasini
tharatharala preyasini chaarukesini
aadave andaala surabhaamini
paadave kalalanni okatenani
aadave andaala surabhaamini
oho menaka madhana mayuka
saginchu ne raasaleela
chupinchu srungaara hela
saginchu ne raasaleela
:::3
nagavula tho meni biguvulatho
nagavula tho meni biguvulatho
vagalolikinchu vayyari nerajaananu
ye chota thaakinaa
ye gota meetina
madhuvu lolikinchi marulu chilikinchu
madhuramaina rasa veenanu
rathi raaja kala praveenanu
sarangalochananu
aadave andaala surabhaamini
paadave kalalanni okatenani
aadave andaala surabhaamini
No comments:
Post a Comment