Friday, September 16, 2011

చల్‌మోహనరంగ--1978

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

సంగీతం::Bశంకర్(Ghazal Sankar)
రచన::జాలాది రాజా రావ్
గానం::SP.బాలు

ఘల్లుఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ..కలహంస నడకల కలికి
సింగారం ఒలకంగా చీర కొంగులు జార రంగైన నవ మోహనాంగి
ఈడు జోడు మనకు ఇంపుగా కుదిరింది..కోపమెందుకే కోమలాంగిరాణి

ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ..కలహంస నడకల కలికి

అందాల గంధాలు పూసేయన..సిందూర కుసుమాలు సిగముడవన
అందాల గంధాలు పూసేయన..సిందూర కుసుమాలు సిగముడవన
చిలకమ్మో కులికి పలుకమ్మో..ఆ..చిలకమ్మో కులికి పలుకమ్మో

నిలువెత్తు నిచ్చెన్లు నిలువేయన..నీ కళ్ళ నెలవళ్ళ నిడేంచన
మడతల్లో మేని ముడతల్లో..ముచ్చట్లో చీరె కుచ్చేట్లో
మడతల్లో మేని ముడతల్లో..ముచ్చట్లో చీరె కుచ్చేట్లో
పసుపు పారణేసి..పట్టే మంచం వేసి
పసుపు పారణేసి..పట్టే మంచం వేసి
దొంతు మల్లెల మీద దొర్లించనా..
అలవేణి అలకల్లె..నెలరాణి కులుకల్లె
కలలెల్లి పోకమ్మ కలికి..

ఈడు జోడు మనకు ఇంపుగా కుదిరింది..కోపమెందుకే కోమలాంగిరాణి
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ ..కలహంస నడకల కలికి

గగనాల సిగపూల పరుపేయన..పన్నీటి వెన్నెల్లో ముంచేయన
గగనాల సిగపూల పరుపేయన..పన్నీటి వెన్నెల్లో ముంచేయన
నెలవంక చూడు నావంక..చిట్టి నెలవంక చూడు నావంక
నీ మేని హోయలన్ని ఒలిపించనా..ఎలమావి తోటేసి కొలువుంచనా
పొద్దులో సందెపోదుల్లో..నిదట్లో ముద్దు ముచ్చట్లో
పొద్దులో సందెపోదుల్లో..నిదట్లో ముద్దు ముచ్చట్లో
నట్టింట దీపాన్ని నడికొండకెకించి..చీకట్లో వాకిట్లో చిందేయన
పొగరంతా ఎగరేసి వగలంతా ఒలకేసి..కవ్వించబోకమ్మ కలికి..

ఈడు జోడు మనకు ఇంపుగా కుదిరింది..కోపమెందుకే కోమలాంగిరాణి
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ..కలహంస నడకల కలికి