Saturday, April 16, 2011

వాగ్దానం--1961::వసంతకల్యాణి::రాగం



సంగీతం::పెండ్యాల
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::అక్కినేని,కృష్ణకుమారి,రేలంగి,గుమ్మడి,పద్మనాభం,సూర్యకాంతం,చలం

వసంతకల్యాణి::రాగం

పల్లవి::

పాహి రామ ప్రభో వరదా శుభదా
పాహి దీన పాలా ఆఆఆ..

వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా..రామా..
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా

చరణం::1

ఆ ఆ ఆ ఆ..
మాహాత్ములైనా దురాత్ములైనా
మనుజులపేరనే మసలేరయ్యా
మాహాత్ములైనా దురాత్ములైనా
మనుజుల పేరనే మసలేరయ్యా
అందరికీ నీ..అభయం కలదని
అనుకోమందువా దేవా
అనుకోమందువా దేవా ఆఅ..
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా


చరణం::2

ఆ ఆ ఆ ఆ..
నేరకచేసిన కారణమున
మా నేరము నేరము కాకపోవునా
నేరక చేసిన కారణమున
మా నేరము నేరము కాకపోవునా
కన్నీరే ఆ..కలుశమునంతా
కడిగివేయునా రామా
కడిగివేయునా రామా ఆఅ..
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా

చరణం::3

ఆ ఆ ఆ ఆ..
కలరూపేదో కలవో లేవో
ఆ ఆ ఆ ఆ....
కలరూపేదో కలవో లేవో
జగమున్నది ఈ వేదనకేనో
ఏది అన్నెమో ఏది పున్నెమో
ఎరుగలేము శ్రీరామా..ఆఅ..
ఎరుగలేము శ్రీరామా..ఆఅ..
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా

No comments: