Friday, April 15, 2011

శ్రీమంతుడు--1971::కాఫీ::రాగం

సంగీతం::TV.చలపతిరావ్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,ఘంటసాల

రాగం::కాఫీ:::
పీలు:::రాగం

కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా

కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా
నీవు నాకు తోడై వుంటే లోకాలే గెలిచేస్తరా

కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా

కన్ను కలిపి కవ్వించేవు వెన్న లాగ కరిగించేవు
నిన్ను చేరి నీరైపోతే నన్ను చ్హూసి నవ్వేసేవు

ఇన్నినాళ్ళు దాచిన వయసు ఈనాడే కానుక నీకు
కలకాలం నీ కౌగిలిలో కరగాలని కోరిక నాకు

కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా
నీవు నాకు తోడై వుంటే లోకాలే గెలిచేస్తరా
కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా

మధుశాలవు నీవై నావు బాటసారి నేనైనాను
ఓ..లైలా నీ వాకిలిలో మజునూనై నిలుచున్నాను

నీలికురుల నీడలోన నిన్ను దాచుకుంటా నేను
నిండువలపు నీడలోన నిన్ను కుంటా నేను

కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా
నీవు నాకు తోడై వుంటే లోకాలే గెలిచేస్తరా
కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా

No comments: