Saturday, April 16, 2011

భక్త కన్నప్ప--1976

సంగీతం::సత్యం
రచన::వీటూరి సుందరరామమూర్తి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,వాణిశ్రీ,శ్రీధర్,జయమాలిని,రావు గోపాలరావు,బాలయ్య,ప్రభాకరరెడ్డి

పల్లవి::
తల్లీ తండ్రీ నీవేనమ్మా..చల్లని తల్లీ గౌరమ్మా     
తల్లీ తండ్రీ నీవేనమ్మా..చల్లని తల్లీ గౌరమ్మా     

చరణం::1

అమ్మలగన్న అమ్మవు నీవు..ముజ్జగాలకే ముత్తయిదువవు
నిత్యసుమంగళి నీవేనమ్మా..నిత్యసుమంగళి నీవేనమ్మా
నీ తలపే..శుభమంగళమమ్మా 
తల్లీ తండ్రీ నీవేనమ్మా..చల్లని తల్లీ గౌరమ్మా     

చరణం::2

కలవని కొలచినా శిలవని తలచినా..తలపేదైనా దైవము నీవే
వెన్నేకానని కన్నులు మావి..వెలుగు నీయవే మంగళ గౌరీ  
తల్లీ తండ్రీ నీవేనమ్మా..చల్లని తల్లీ గౌరమ్మా     

చరణం::3

దీనజనావని పతితపావనీ..దిక్కుచూపవే తల్లీ
నేరక చేసిన నేరాలెంచక..దరిజేర్చు కల్పవల్లీ
మమ్ముగావమని మహాదేవునికి..మనవి చేయవే దేవీ
శంకరీ శివశంకరీ అభయంకరీ..అమ్మాఈశ్వరీ 

No comments: