సంగీతం::పెండ్యాల
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని,కృష్ణకుమారి,రేలంగి,గుమ్మడి,పద్మనాభం,సూర్యకాంతం,చలం
పల్లవి::
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ వున్న జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడ దానివే
చరణం::1
తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా
తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా
కళ్ళెం పట్టీ..కళ్ళెం పట్టి కళ్ళనుకట్టి
నడిపే మొనగాడుండాలీ
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ వున్న జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడ దానివే
చరణం::2
అందనిదైనాగాని నరులందరు కోరుదురందాన్ని
అందనిదైనాగాని నరులందరు కోరుదురందాన్ని
తూకంవేసీ..తూకంవేసి పాకంచూసి
డెందం ఒకరికే ఇవ్వాలి
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే..ఓఓఓ
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
చరణం::3
అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపీ
అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపీ
అతగాడొకడు జతయైనపుడు అన్నీ ఉన్నవనుకోవాలి
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే..ఓహో
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ వున్న జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడ దానివే
ఆహహా...హహహహా....ఆహహా..హహహ..హా..
No comments:
Post a Comment