సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.జానకి
పల్లవి::
ఒకసారే..ఒకసారే
ఒకసారికి ఒకసారే..మళ్ళీమళ్ళీ అడగొద్దు
మొదటిసారి తియ్యదనం..రద్దుచేసుకోవద్దు
అప్పుడే..అది..ముద్దు
ఒకసారే..ఒకసారే
ఒకసారికి ఒకసారే..మళ్ళీమళ్ళీ అడగొద్దు
మొదటిసారి తియ్యదనం..రద్దుచేసుకోవద్దు
అప్పుడే..అది..ముద్దు
చరణం::1
సూటిగా నాటేది మొదటి..చూపు
ఏ నాటికీ వినపడేది మొదటి..పలకరింపు
ఏదైనా మొదటిదే..ఇంపైనది
రెండవది ఎన్నడూ కాదు..మొదటిది
అందుకే..అది..ముద్దు
ఒకసారే..ఒకసారే
ఒకసారికి ఒకసారే..మళ్ళీమళ్ళీ అడగొద్దు
చరణం::2
మొదటి పువ్వు చెపుతుంది..తీగపడే సంబరం
మొదటి మెరుపు తెలుపుతుంది..మబ్బులోని నిండుతనం
మొదటి చినుకులో వుంది వాన..ముమ్మరం
మొదటి చినుకులో వుంది వాన..ముమ్మరం
మొదలూ తుది లేనిదే ప్రేమ..లక్షణం
అందుకే..అది..ముద్దు
ఒకసారే..ఒకసారే
ఒకసారికి..ఒకసారే..మళ్ళీమళ్ళీ..అడగొద్దు
చరణం::3
ముద్దనేది ప్రేమకు..మొదటి ముద్ర
ప్రేమనేది మనసునూ..లేపుతుంది నిద్దుర
ముద్దనేది ప్రేమకు..మొదటి ముద్ర
ప్రేమనేది మనసునూ..లేపుతుంది నిద్దుర
మేలుకున్న మనసుకు..మేరనేది లేదు
అది ప్రేమించేటందుకు..ఈ సృష్టి చాలదు
మేలుకున్న మనసుకు..మేరనేది లేదు
అది ప్రేమించేటందుకు..ఈ సృష్టి చాలదు
అందుకే..అది..ముద్దు..ముద్దు
ఒకసారే..ఒకసారే
ఒకసారికి ఒకసారే..మళ్ళీమళ్ళీ అడగొద్దు
మొదటిసారి తియ్యదనం..రద్దుచేసుకోవద్దు
అప్పుడే అది ముద్దు..అప్పుడే అది ముద్దు
No comments:
Post a Comment