http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5429
సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు
పల్లవి::
పూచిన పారిజాతమా..రాయని ప్రేమ గీతమా
నా ఒడిలో పరిమళించవే..నా హృదిలో ప్రతిఫలించవే

చరణం::1
నీ సొగసుకు నేనే వయసని..నా వయసుకు నువ్వే మనసని

ఇద్దరమూ తెలుసుకొని..తొలి ముద్దులతో ముడి వేసుకొని

నీ కన్నె స్వప్నము..నే కన్న స్వర్గము..నిత్య సత్యము కావాలి
పూచిన పారిజాతమా..రాయని ప్రేమ గీతమా
నా ఒడిలో పరిమళించవే..నా హృదిలో ప్రతిఫలించవే
నా ఒడిలో పరిమళించవే..నా హృదిలో ప్రతిఫలించవే
చరణం::2
నీ దేవుడు నేనే కావాలి..నా పుజకు నువ్వే రావాలి

గుండెకు నిన్ను హత్తుకొని మన కౌగిలినే గుడి చేయాలి

నా పురుష జన్మము..నీ పూర్వపుణ్యము..వరమై స్థిరమై ఉండాలి
పూచిన పారిజాతమా..రాయని ప్రేమ గీతమా
నా ఒడిలో పరిమళించవే..నా హృదిలో ప్రతిఫలించవే
లాలాలలలలాలలా..లలలాలలలలాలలా
No comments:
Post a Comment